జనసేన టిడిపి మధ్య సేట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో రెండు పార్టీల అధినేతలు అధికారికంగా ఏ క్లారిటీ ఇవ్వకపోయినా, కొన్ని నియోజకవర్గాల పేర్లు బయటకి వచ్చాయి.26 అసెంబ్లీ ,మూడు పార్లమెంట్ స్థానాలను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లుగా ప్రచారం జరుగుతుంది.అయితే ఇంత తక్కువ సీట్లు తీసుకోవడంపై జనసేన వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది.కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య( Chegondi Hari Rama Jogayya ) సైతం విమర్శలు చేశారు.
సీఎం పదవి షేరింగ్ విషయంలో ముందుగానే ఒప్పందం చేసుకోకపోతే ఎలా అంటూ పవన్ ను ప్రశ్నించారు.చంద్రబాబును సీఎం చేయడానికి కాపులు సిద్ధంగా లేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![Telugu Ap, Chandrababu, Chegondihari, Janasena, Janasenani, Pavankalyan, Pawan, Telugu Ap, Chandrababu, Chegondihari, Janasena, Janasenani, Pavankalyan, Pawan,](https://telugustop.com/wp-content/uploads/2024/02/janasenani-pawan-tdp-Chegondi-Hari-Rama-Jogayya-chandrababu-naidu-cbn-ap-government-tdp-janasena-aliance.jpg)
ఇది లో ఉంటే ఇంత తక్కువ సీట్ల కేటాయింపు చంద్రబాబు ఏ విధంగా ఒప్పించారు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని, దాదాపు 50 నుంచి 60 స్థానాలు వరకు పోటీ చేసే అవకాశం ఉందంటూ పరోక్షం గా హింట్ ఇచ్చారు.అయితే 25 నుంచి 30 సీట్ల వరకు మాత్రమే జనసేనకు ఇచ్చేలా చంద్రబాబు పవను ఒప్పించినట్లు సమాచారం.దీనికి కారణాలను కూడా చంద్రబాబు( Chandrababu naidu ) వివరించినట్లు తెలుస్తోంది.
![Telugu Ap, Chandrababu, Chegondihari, Janasena, Janasenani, Pavankalyan, Pawan, Telugu Ap, Chandrababu, Chegondihari, Janasena, Janasenani, Pavankalyan, Pawan,](https://telugustop.com/wp-content/uploads/2024/02/janasenani-pawan-tdp-chandrababu-naidu-cbn-ap-government-tdp-janasena-aliance.jpg)
సమర్థవంతమైన నాయకత్వంతో పాటు, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు సర్ది చెప్పడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలకపావులను జనసేనకు కేటాయిస్తామని పవన్ కు చంద్రబాబు భరోసా ఇచ్చారట.దీంతోనే సీట్ల విషయంలో పవన్ సర్దుకుపోయినట్లుగా తెలుస్తోంది.అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం జనసేన( Janasena ) నాయకులు ఈ సీట్ల వ్యవహారం పై తీవ్ర అసంతృప్తి నెలకొంది.
అయితే పవన్ మాత్రం ఈ అసంతృప్తులను పట్టించుకోనని, ఎవరైనా పార్టీ క్రమక్షికానకు లోబడే ఉండాలి అంటూ పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే,.