యాదాద్రి భువనగిరి జిల్లా: గతంలో జర్నలిస్టులకు( Journalists ) కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్రెస్ క్లబ్( Press Club ) ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, సమస్య పరిష్కారం కోసం కోర్ట్ లో కౌంటర్ ఫైల్ సమర్పించాలని స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదేశించినా తహసీల్దార్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.