ఫస్ట్ లుక్ తోనే సినిమా మీద ఇంట్రెస్ట్ పెంచేసిన హనిరోజ్...

బాలయ్య బాబు హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి( Veera Simha Reddy ) సినిమాలో హీరోయిన్ గా నటించిన హని రోజ్ ఆ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది… ఆమె ఈ సినిమాలో కనిపించిన లుక్స్‌, కాస్ట్యూమ్స్‌ కుర్రాళ్లకు కిక్‌ ఇస్తూనే ఉన్నాయి.టైట్‌ఫిట్‌ దుస్తులు, జిగేల్‌మనే సొగసులతో కనిపించినా.

 Honey Rose Next Movie Rachel First Look, Hany Rose , Veera Simha Reddy ,the Kera-TeluguStop.com

అమెలో అదిరిపోయే నటి ఉందనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ.ఓ డిఫరెంట్‌ లుక్‌లో దర్శనమివ్వబోతోంది.అంతేకాదు ఇప్పుడు ఆ సినిమా మీద పెద్ద ఎత్తున రచ్చ కూడా సాగుతోంది…

Telugu Hany Rose, Rachel, Kerala Story, Tollywood-Movie

రాహేలు( Rachel ) అనే పాన్ ఇండియన్ సినిమాలో హనీ రోజ్‌ నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలోని హనీ రోజ్ ఫస్ట్ లుక్‌ను టీమ్‌ రిలీజ్ చేసింది.ఇందులోనూ హనీ బోల్డ్ లుక్‌లోనే కనిపిస్తోంది.అయితే కాస్త డీగ్లామర్‌ లుక్‌లోనూ ఉంటుంది.ఈ సినిమాలో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపిస్తుందట.ఫస్ట్‌ లుక్‌లో కూడా హనీ రోజ్‌ను అలానే చూపించారు.

ఆమెను చూసి వావ్‌ అంటున్న నెటిజన్లు.సినిమా కాన్సెప్ట్‌ విషయంలో మాత్రం ఫైర్ అవుతున్నారు.ఏకంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు…c, Hany Rose , Veera Simha Reddy ,The Kerala Story , Nandamuri Balakrishna , rachel, first look, tollywood

Telugu Hany Rose, Rachel, Kerala Story, Tollywood-Movie

ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోలో ఆమె పక్కన బీఫ్ వేలాడదీసి ఉంది.మొద్దు మీద దున్నపోతు తలకాయ కనిపించింది.అసలే బీఫ్‌ అమ్మకం, వినియోగం విషయంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫస్ట్ లుక్, సినిమా వివాదాస్పదం అవుతోంది.దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

అయితే విషయమై చిత్ర బృందం నుండి ఎలాంటి రియాక్షన్‌ లేదు.త్వరలోనే ఈ వివాదం గురించి ఏదో ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న చిన్నపాటి చర్చ… రానురాను రచ్చగా మారే అవకాశం ఉంది అని అంటున్నారు.ఇటీవల ‘కేరళ స్టోరీ’( The Kerala Story ) విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది.

దీంతో సినిమా ప్రదర్శన, వసూళ్ల విషయంలో కాస్త ప్రభావం కూడా కనిపించింది…ఇక ఈ సినిమా తో కేరళ స్టోరీలెవల్లో సత్తా చాటాలని చూస్తున్న హనీ రోజ్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube