ఇంట్లో తేనె ఉందా..? అయితే స‌న్ ట్యాన్‌తో నో టెన్ష‌న్‌!

స‌న్ ట్యాన్‌.ప్ర‌స్తుత స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో అంద‌రినీ ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య ఇది.

చ‌ర్మం ఎంత తెల్ల‌గా, మృదువుగా, కోమ‌లంగా ఉన్నా.స‌న్ ట్యాన్‌కు గురైతే అంద‌హీనంగానే క‌నిపిస్తుంది.

అందుకే స్కిన్ ఎక్క‌డ ట్యాన్ అవుతుందో అని కొంద‌రైతే బ‌య‌ట‌కు వెళ్ల‌డానికే జంకుతుంటారు.ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల యూవీ కిరణాలు నేరుగా మీద ప‌డి చర్మ కణాలు డ్యామేజ్ అవుతాయి.

దాంతో చ‌ర్మం న‌ల్ల‌బ‌డ‌టం, ఎర్రగా క‌మిలిపోవ‌డం జ‌రుగుతుంటుంది.దాన్నే స‌న్ ట్యాన్ అని అంటారు.

Advertisement

స‌న్ ట్యాన్‌కు గురైన చ‌ర్మాన్ని ఎలా నివారించుకోవాలో తెలియ‌క తెగ స‌త‌మ‌తం అవుతుంటారు.అయితే ఇంట్లో తేనె ఉంటే స‌న్ ట్యాన్‌తో టెన్ష‌న్ ప‌డ‌క్క‌ర్లేదు.

తేనెలో ఉండే ప్ర‌త్యేక‌మైన సుగుణాలు ట్యాన్ అయిన చ‌ర్మాన్ని మ‌ళ్లీ మామూలు స్థితికి చేర్చ‌గ‌ల‌వు.మ‌రి ఇంత‌కీ తేనెను చ‌ర్మానికి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకొని విస్క‌ర్ సాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేసి ప‌దిహేను నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.

ఆపై వేళ్లతో సున్నితంగా రుద్దుతూ ప్యాక్‌ తొలగించి వాట‌ర్‌తో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇలా రోజుకు ఒక‌సారి చేస్తే స‌న్ ట్యాన్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ ప్యూర్ అలోవెర జెల్‌, చిటికెడు ప‌సుపు, వ‌న్ టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి ప‌ట్టించి ఆర‌బెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు