మూడు చిరుత పులులతో పోరాడి గెలిచిన హనీ బాడ్జర్‌.. షాకింగ్ వీడియో వైరల్..

హనీ బాడ్జర్‌ను ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన జంతువు అని పిలుస్తారు.ఎందుకంటే ఇది తనకంటే చాలా పెద్ద జంతువులపై దాడి చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయదు.

సింహాలు, పులులు, మొసళ్లు, ఇంకా ఎంత పెద్ద జంతువులతోనైనా ఇవి యుద్ధానికి సిద్ధం అని అంటుంటాయి.పొట్టి, బలమైన కాళ్లతో బలిష్టమైన, చదునైన శరీరాన్ని కలిగి ఉండే ఇవి దేనిపై పోరాడినా గెలుపే సాధిస్తాయి.

ఇందుకు కారణం హనీ బాడ్జర్‌ చర్మం చాలా దృఢంగా ఉంటుంది.వదులుగా ఉండే దీని మందపాటి చర్మాన్ని ఎంత పదునైన పళ్ళతో కొరికినా అవి దాని శరీరంలోకి వెళ్లలేవు.పంజాతో బలంగా కొట్టినా.

పదునైన ఆయుధంతో పొడిచినా దీని శరీరంలోకి మిల్లీమీటర్ కూడా అవి దిగలేవు.వీటి శరీరంపైన ఉండే తోలు మందం దాదాపు 6 మిమీ ఉంటుంది.

Advertisement

ఇది చాలా గట్టిగా ఉంటుంది.ఈ విషయం తెలియక మూడు చిరుతపులులు దాన్ని చంపేసి తినేయాలని అనుకున్నాయి.

కానీ సీన్ రివర్స్ అవడంతో బతుకు జీవుడా అంటూ పారిపోయాయి.వీటి మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో నీటి మడుగు వద్ద తల్లి చిరుతతో కలిసి రెండు పిల్ల చిరుతలు ఒక హనీ బాడ్జర్‌ను అత్యంత పాశవికంగా పళ్లతో కొరికాయి.తల్లి చిరుత బాడ్జర్‌ మెడను గట్టిగా కొరికింది.దాని పక్కనే ఉన్న పిల్ల చిరుత పులులు సైతం బాడ్జర్‌ వెనుక భాగంలో బలంగా కరిచాయి.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
ఒలంపిక్ పతకాలలో నిజంగా బంగారం ఉంటుందా..? లేదా..?

ఈ క్రమంలో ఆ బాడ్జర్‌ వాటి నుంచి విడిపించుకునేందుకు తన వెనుక కాళ్లతో తన్నుతూ ఉంది.ఆ తర్వాత వాటి నుంచి విడిపించుకొని ఎదురుదాడికి దిగింది.పెద్ద చిరుత పులితో సహా రెండు కుర్ర చిరుతలను కూడా అది పరిగెత్తించింది.

Advertisement

చాలాసేపు ఈ చిరుతలు దానిపై దాడి చేసినా దానికి చిన్న గాయం కూడా కాలేదు.ఒక్క రక్తపు బొట్టు కూడా నేల జారలేదు.

చివరికి మూడు సింహాలపై ఎదురుదాడి చేసి ఈ హనీ బాడ్జర్‌ పైచేయి సాధించింది.అనంతరం అక్కడి నుంచి దర్జాగా వెళ్లిపోయింది.

ఈ వీడియో ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి చాలా సోషల్ మీడియా సైట్ లో వైరల్ అవుతోంది.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు