జ‌‌లుబు, జ్వ‌రం నుంచి పిల్ల‌ల‌ను ర‌క్షించే సూప‌ర్ టిప్స్ ఇవే?

చ‌లి కాలం ప్రారంభం అయింది.ఈ చ‌లి కాలాన్నే రోగాల కాలం అని కూడా అంటారు.

ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో రోగాలు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి.ముఖ్యంగా పిల్ల‌లు జ‌లుబు, జ్వరం వంటి స‌మ‌స్య‌ల బారిన ఎక్కువ‌గా ప‌డుంటారు.

Home Remedies For Get Rid Of Cold And Fever In Kids! Home Remedies, Cold, Fever,

ఎందుకంటే, వారిలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోవ‌డమే ప్ర‌ధాన కార‌ణం.ఇక పిల్ల‌ల‌కు జ‌లుబు, జ్వ‌రం వ‌చ్చిందంటే త‌ల్లిదండ్రులు తెగ హైరానా ప‌డిపోతుంటారు.

కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే పిల్ల‌ల‌కు వ‌చ్చే ఆ స‌మ‌స్య‌ల‌ను సులువుగా నివారించ‌వ‌చ్చు.పిల్ల‌ల‌కు జ‌లుబు, జ్వ‌రం సోకిన‌ప్పుడు.

Advertisement

ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు మ‌రియు తేనె క‌లిపి ఇవ్వాలి.పాలు, తేనె, ప‌సుపు ఈ మూడిటిలోనూ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పిల్ల‌ల్లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచి.

జ‌లుబు, జ్వరం స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.అలాగే ఈ చ‌లి కాలంలో పిల్ల‌లు ఉండే ప్రాంతాన్ని తేమ‌గా కాకుండా వేడిగా ఉండేలా చూసుకోవాలి.

తేమ ఉంటేనే పిల్ల‌లు జ‌బ్బుల బారిన ప‌డ‌తారు.ఇక జ‌లుబు, జ్వ‌రం సోకిన పిల్ల‌ల‌కు వేడి నీటితోనే స్నానం చేయించాలి.

అప్పుడే వారికి రిలాక్స్‌గా ఉంటుంది.జలుబు, జ్వ‌రం తీవ్రంగా ఉన్నప్పుడు.

మోచేతుల నలుపును పోగొట్టే మోస్ట్ పవర్ ఫుల్ రెమెడీ ఇది.. డోంట్ మిస్..!

గోరువెచ్చని నీటిలో దాల్చినచెక్క పొడి, తేనె, నిమ్మరసం వేసి బాగా కలిపి పిల్ల‌ల‌కు ప‌ట్టిస్తే త్వ‌ర‌గా కోలుకుంటారు.అలాగే నీటిలో కొన్ని తుల‌సి ఆకుల‌ను మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకుని.

Advertisement

గోరు వెచ్చ‌గా అయ్యాక పిల్ల‌ల‌కు ఇవ్వాలి.ఈ డ్రింక్ వ‌ల్ల పిల్ల‌ల‌కు జ‌లుబు, జ్వ‌రం స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

అలాగే ఈ చ‌లి కాలంలో పిల్ల‌ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చల్లని ద్రావణాలు ఇవ్వ‌రాదు.నీటిని కూడా కాచి.

గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత పిల్ల‌ల‌కు ప‌ట్టించాలి.ఇక జ‌లుబు అధికంగా ఉంటే.

రోజుకు క‌నీసం రెండు సార్లు పిల్ల‌ల‌తో ఆవిరి ప‌ట్టించాలి.ఆవిరి ప‌ట్ట‌డం ద్వారా జ‌లుబు స‌మ‌స్య‌ను త్వ‌ర‌గా నివారించుకోవ‌చ్చు.

తాజా వార్తలు