పాదాల సంరక్షణకు పాటించాల్సిన ఇంటి చిట్కాలు

సాదారణంగా ప్రతి ఒక్కరు అందమైన మరియు మృదువైన పాదాలు కావాలని కోరుకుంటారు.కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అందమైన పాదాలు ఉంటాయి.

మొత్తం శరీర బరువు అంతా పాదాలపై పడుట వలన, పాదాలు గాయాలు,అలసట మరియు ఇన్ఫెక్షన్స్ కి గురి కావచ్చు.పాదాలను నిర్లక్ష్యం చేస్తే పాదాల నొప్పి మరియు అనేక సమస్యలు వస్తాయి.

అందువలన పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

1.ప్రతి రోజు పాదాలను కడగాలి:

శరీరంలో ఇతర బాగాలు కన్నా పాదాలలో చెమట ఎక్కువగా ఉంటుంది.అందువల్ల క్రమం తప్పకుండా పాదాలను కడగాలి.

రోజు ప్రారంభంలో ఒకసారి రోజు చివర ఒకసారి పాదాలను కడగటం అలవాటు చేసుకోవాలి.చెమట, ధూళి మరియు బ్యాక్టీరియా వదిలించుకోవటానికి ఒక తేలికపాటి సబ్బు లేదా యాంటిసెప్టిక్ సబ్బు మరియు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.

Advertisement

ఎక్కువ వేడి ఉన్న నీటిని ఉపయోగించకూడదు.ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే పాదాలలో సహజ నూనెలు తగ్గిపోవటమే కాక పాదాల పగుళ్ళకు కారణం అవుతుంది.

పాదాలను కడిగిన వెంటనే పొడిగా తుడుచుకోవాలి.లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

2.వారానికి రెండు సార్లు ఎక్స్ ఫ్లోట్:

పాదాలను కడగటమే కాకుండా స్క్రబింగ్ చేయటం కూడా ముఖ్యమే.పాదాల చర్మం మందంగా ఉంటుంది.

కాబట్టి నునుపుగా మరియు మృదువుగా చేయటానికి ఎక్స్ ఫ్లోట్ చేయటం తప్పనిసరి.పాదాలకు స్క్రబింగ్ చేస్తే చనిపోయిన మృత కణాలు తొలగిపోతాయి.

ప్యుమిక్ రాయితో పాదాలకు స్క్రబింగ్ ను చాలా సున్నితంగా చేయాలి.స్క్రబింగ్ చేయటానికి ముందు పాదాలను పది నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
మనీ ప్లాంట్ నాటేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివే!

బేబి ఆయిల్ లో పంచదార లేదా ఉప్పు కలిపి పేస్ట్ గా చేయాలి.ఈ పేస్ట్ ని పాదాలకు రాసి వృత్తాకార కదలికలతో మసాజ్ చేసి స్క్రబింగ్ చేయాలి.

Advertisement

ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాదాలను పొడిగా తుడిచి మంచి క్రీం ని రాయాలి.

3.పాదాలను తేమగా ఉంచాలి:

పాదాలు పొడిగా మారినప్పుడు పగుళ్ళు వస్తాయి.అందువల్ల పాదాలను ఎప్పుడు తేమగా ఉంచుకోవాలి.

అందువల్ల ప్రతి రోజు రాత్రి పడుకోనే ముందు పాదాలకు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.మాయిశ్చరైజర్ రాసినప్పుడు పాదం పైన కింద కూడా రుద్దాలి.

ఆ తర్వాత పాదాలకు క్రీం రాసి పది నిమిషాల పాటు వృత్తాకార కదలికలతో మసాజ్ చేయాలి.శీతాకాలంలో పగుళ్ళు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల పాదాలు తేమగా ఉండటానికి సాక్స్ ధరించాలి.పాదాలను తేమగా ఉంచటానికి కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా కోకో వెన్న వంటి సహజమైన ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

4.ప్రతి రోజు మసాజ్ చేయాలి:

పాదాలు అన్ని రకాల సమస్యల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి రోజు మసాజ్ చేయాలి.మసాజ్ చేయటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

* కాళ్ళల్లో రక్త ప్రసరణ అభివృద్ధి * అలసిన కాళ్ళకు విశ్రాంతి * చీలమండలు బలంగా తయారు అవుతాయి * నొప్పి మరియు వాపు ఉపశమనం * పాదాల మంట తగ్గుతుంది ప్రతి రోజు పాదాలకు గోరువెచ్చని ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే సరిపోతుంది.

తాజా వార్తలు