మెగా పవర్ స్టార్ పై హాలీవుడ్ నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మెగాస్టార్ వారసుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కొద్దీ కాలంలోనే తనని తాను నిరూపించుకుని స్టార్ హీరోగా ఎదిగాడు రామ్ చరణ్ తేజ్. ఇక ఈ మధ్యనే అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి యావత్ ప్రపంచాన్ని మెప్పించాడు.

 Hollywood Actress Samantha Win Comments On Ram Charan, Ram Charan, Hollywood Act-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
పాన్ ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా కూడా మెగా పవర్ స్టార్ గుర్తింపు అందుకున్నాడు.

ట్రిపుల్ ఆర్ సినిమా సమయంలో ఎంతో మంది హాలీవుడ్ ప్రముఖుల చేత చరణ్ ప్రశంసలు అందుకున్నాడు.ఇక ఫిమేల్ ఆడియెన్స్, సెలెబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమాతో ఫిమేల్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఇదిలా ఉండగా తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటి సమంత చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మంచి వైరల్ అయ్యాయి.తాజాగా చరణ్ కాలిఫోర్నియాలో జరిగే ఒక అవార్డు వేడుకకు హాజరయ్యాడు.

ఈ వేడుకలో భాగంగా చరణ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ లుక్ పై సమంత కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పిక్ కి గాను సమంత విన్ కామెంట్స్ చేస్తూ ”అతను చాలా బాగున్నాడు.తన కోసం ఫింగర్స్ క్రాస్ చేసి ఉన్నాను” అంటూ చరణ్ లుక్ పై పొగుడుతూ కామెంట్స్ చేస్తూనే తన అవార్డు కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు చెప్పకనే చెప్పింది.

ఈ స్టేట్మెంట్ తో మరోసారి రామ్ చరణ్ పేరు హాలీవుడ్ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube