Hit 2 Adivi Sesh : అడివి శేష్ రేంజ్ పెరిగిందిగా.. హిట్2 మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఎంతంటే?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన అడివి శేష్ హిట్2 సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.మండే రోజు కూడా ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.హిట్2 సినిమాతో అడివి శేష్ రేంజ్ పెరిగిందని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

 Hit2 Movie First Week Collections Details Here Goes Viral In Social Media , Hit2-TeluguStop.com

ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా ఏకంగా 28.1 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.అడివి శేష్ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకోవడం అభిమానులకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. నాని బ్యానర్ అధికారక ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

ఈ కలెక్షన్ల విషయంలో నాని సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఓవర్సీస్ లో కూడా హిట్2 మూవీ అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంటోంది.ఈ సినిమా సక్సెస్ తో దర్శకుడు శైలేష్ కొలనుకు హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఆఫర్లు పెరుగుతున్నాయి.హిట్1 రేంజ్ లో లేకపోయినా ఆసక్తికర ట్విస్టులు ఉండటం హిట్2 కు ప్లస్ అయింది.అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.అడివి శేష్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే.

Telugu Adivi Sesh, Nani, Shailesh Kolanu-Movie

హిట్3 మూవీలో నాని హీరోగా నటించనుండగా నాని ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాల్సి ఉంది.పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాని కనిపించనున్నారని తెలిసి ఫ్యాన్స్ సైతం సంతోషిస్తున్నారు.హిట్3 సినిమాతో నాని ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube