బాలయ్య గుండెల్లో దడ దడ లు మొదలయ్యాయా ...?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్నట్టు కనిపిస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం.

, నాయకుల అవినీతి వ్యవహారాలు ఇవన్నీ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి.దీంతో పాటు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో పార్టీలో ఉన్న కీలక నాయకులంతా.

ఒక్కొక్కరిగా టీడీపీ ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోవడం గందరగోళం సృష్టిస్తోంది.అంతే కాదు ప్రస్తుతం ఏపీలో పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్టు ఇంటలిజెన్స్ సర్వేలో తేలడం అధినేత చంద్రబాబు లో కలవరం పుట్టిస్తోంది.

ఇక బాబు వియ్యంకుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో టీడీపీకి షాక్ తగిలింది.

Advertisement

హిందూపురంలో మొన్నటి వరకు బాలకృష్ణకు చేదోడు వాదోడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.ముందుగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు కి అబ్దుల్ ఘనీ లేఖ రాశారు.

శనివారం వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.30 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ.పార్టీకి కృషి చేసినా.

తనకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న కారణంతో పార్టీని వీడినట్లు అబ్దుల్ ఘనీ చెబుతున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి మరో ఫిర్యాదు..!!

ముస్లిం లకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని.నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని .నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారని .ముస్లింలకు నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్ దేనని అన్నారు.అబ్దుల్ ఘనీ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరుపున పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరినట్టు సమాచారం.ఈ పరిణామాలతో ప్రస్తుత ఎమ్యెల్యే బాలకృష్ణ ఆందోళన చెందుతున్నాడు.ఎందుకంటే.? వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ టికెట్ బాలయ్యకే ఖాయం అవుతున్న నేపథ్యంలో మెజార్టీ ఓటర్లను ప్రభావితం చేయగల సామర్ధ్యం ఉన్న పార్టీ సీనియర్ లీడర్ ఇలా .తనకే ప్రత్యర్థిగా మారబోతుండడం బాలయ్య టెన్షన్ కి కారణం.3 Attachments .

తాజా వార్తలు