పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో అక్కడి ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు చాలా కఠినంగా ఉంటున్నాయి.విద్యా సంస్థల్లోని మహిళా విద్యార్థులు, టీచర్లు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
నోటిఫికేషన్ ప్రకారం, విద్యా సంస్థల్లోని బాలికలు, టీచర్లు హిజాబ్ ధరించడం తప్పనిసరి.ఉత్తర్వులను ఉల్లంఘించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు.
అధికారులు జారీ చేసిన సూచనలను అమలు చేయడంలో విఫలమైతే ఇన్‌స్టిట్యూట్ హెడ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేసేలా చూడాలని విద్యాశాఖ అన్ని పాఠశాలలు మరియు కళాశాలల పరిపాలనను కోరింది.ఈ ఆదేశాలను అమలు చేయడంలో లేదా పాటించడంలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సర్క్యులర్‌లో పేర్కొంది.ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పాఠశాల, కళాశాలల యాజమాన్యాన్ని హెచ్చరించింది.
అయితే, హిజాబ్ ధరించని బాలికలు, టీచర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సర్క్యులర్‌లో పేర్కొనలేదు.

సర్దార్ తన్వీర్ నేతృత్వంలోని పీటీఐ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.సీనియర్ జర్నలిస్టు మరియానా బాబర్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించారు.మహిళలకు హిజాబ్ ధరించాలా, వద్దా అనే దానిపై ఆప్షన్ ఇవ్వాలని అన్నారు.
కో-ఎడ్యుకేషన్ విద్యా సంస్థల్లోని బాలికలు, టీచర్లు హిజాబ్ ధరించడాన్ని పీఓకే ప్రభుత్వం తప్పనిసరి చేసింది.మరోవైపు, పిటిఐ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాలిబన్ల నిర్ణయంతో కొందరు పోలుస్తున్నారు.
గత సంవత్సరం, ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించడాన్ని తాలిబాన్ తప్పనిసరి చేసింది.







