బిగ్ బాస్ డబ్బులతో చెల్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఆది రెడ్డి... ఏమిచ్చారో తెలుసా?

బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి ఆదిరెడ్డి ఎంతో ఫేమస్ అయ్యారు.అయితే ఈయనకి వచ్చిన పాపులారిటీ ద్వారా ఈయన కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలో పాల్గొన్నారు.

 Adi Reddy Gave A Castely Gift To His Sister With Bigg Boss Money ,aadi Reddy ,b-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సెలబ్రిటీలతోపాటు హౌస్ లోప్రతి ఒక్క టాస్క్ లోను గట్టి పోటీగా నిలుస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ వరకు వెళ్లి అందరిని ఎంతో ఆశ్చర్యపరిచారు.ఇలా బిగ్ బాస్ సీజన్ సిక్స్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఆదిరెడ్డి అనంతరం యూట్యూబ్ వీడియోల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తూ వచ్చారు.

Telugu Aadi Reddy, Bigg Boss, Nagalakshmi-Movie

ఇలా బిగ్ బాస్ తర్వాత సెలబ్రిటీలుగా మారిపోయినటువంటి ఆదిరెడ్డి దంపతులు కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.ఇక తాజాగా ఆదివారం విత్ పరివార్ కార్యక్రమంలో భాగంగా ఉమెన్స్ డే స్పెషల్ కార్యక్రమంలో భాగంగా ఆదిరెడ్డి తన సోదరి నాగలక్ష్మి తో కలిసి వేదికపై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిరెడ్డి ప్రస్తుతం ఈ స్థాయిలో తాను ఉన్నాను అంటే అందుకు గల కారణం తన చెల్లేనని తెలిపారు.తాను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్లే సమయంలో తన చెల్లికి వచ్చే పెన్షన్ డబ్బుతోనే బెంగళూరుకు వెళ్లాలని తెలిపారు.

Telugu Aadi Reddy, Bigg Boss, Nagalakshmi-Movie

ఇక తన చెల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు ద్వారానే తాను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించానని ఇప్పుడు తనని ఇక్కడ నిలబెట్టాను అంటూ తన చెల్లి గురించి చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఇలా తనని ఈ స్థాయిలో నిలబెట్టిన తన చెల్లి కోసం ఉమెన్స్ డే సందర్భంగా తన భార్య కవితతో కలిసి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో తనకు వచ్చిన డబ్బుతో ఆదిరెడ్డి తన చెల్లెలకు ఖరీదైన గోల్డ్ నెక్లెస్ తీసుకువచ్చారు.ఇక ఆదిరెడ్డి ఆ గోల్డ్ నెక్లెస్ తన చెల్లి మెడలో వేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.

ఇక తన చెల్లెలు నాగలక్ష్మి మాత్రం తనకు సంతోషం గోల్డ్ నక్లెస్ లో లేదని తన అన్నయ్య చూపించే ప్రేమలో సంతోషముంది అంటూ ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube