కౌశల్ ఆ రోజు చెప్పిన 'అనగనగ ఓ రాజు' కథే ఇప్పుడు నిజం అయ్యింది.! ఇంతకీ ఆ కథ ఏంటి.?

‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 2 ఆదివారం రాత్రితో ముగిసింది.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 17 మందిని గెలుచుకోవడం ముఖ్యం కాదు.

 Highlights Of Nanis Bigg Boss Telugu 2-TeluguStop.com

కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడమే ముఖ్యం అని నిరూపించారు కౌశల్.బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్‌లో కోట్ల ఓట్లను కొల్లగొట్టి విజేతగా నిలిచారు.

వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ టైటిల్ అందుకున్నారు.

ఒక్కడిగా వచ్చాడు.

ఒక్కడిగా ఆడాడు.ఒక్కడిగానే విజేతగా అవతరించాడు కౌశల్.

నేను గేమ్ ఆడటానికి వచ్చా.నేను గేమ్ మాత్రమే ఆడతా.

అందుకోసం నా ప్రాణం పెడతా.నాకు నో రిలేషన్స్.

నో ఎమోషన్స్.నా ఫోకస్ ఓన్లీ బిగ్ బాస్ టైటిల్.

ఈ మొండి పట్టుదలతో హౌస్‌ మేట్ దగ్గర విలన్‌గా మారినా ప్రజల తీర్పు ముందు విజేతగా నిలిచాడు.

తాజా ఎపిసోడ్స్‌లో నాని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యేందుకు నీలో ఉన్న క్వాలిటీ ఏంటి? మిగిలిన వాళ్లలో లేనిది ఏంటి? అన్ని అడగ్గా ఓ కథ ద్వారా వివరించారు కౌశల్.ఆ కథే ఇప్పుడు నిజమైంది ఆ కథ ఏంటో చూద్దాం.

‘అనగనగా ఓ రాజ్యం.

ఆ రాజ్యానికి ఓ రాజు.కాని ఆ రాజ్యానికి వారసుడు మాత్రం ఉండడు.

దీనిపై ఆలోచించిన రాజు నక్షత్రం అనే జట్టుని ఏర్పాటు చేసి.రాజ్యం మొత్తం తిరిగి కండ బలం, గుండె బలం, బుద్ధిబలం ఉన్న 18 మంది వీరుల్ని వెతికిపట్టి తీసుకురావాలంటారు.

రాజు ఆదేశాల మేరకు ఆ జట్టు 18 మందిని వెతికిపట్టి తీసుకువచ్చి రాజు ముందు ప్రవేశ పెడతారు.ఆ వీరుల ముందు ఓ పులి బోనులో ఉంచి ఆ పులి బయటకు విడిచిపెట్టిన తరువాత ఎవరైతే దాన్ని బంధించి పట్టుకుంటారో.

వాళ్లని ఈ రాజ్యానికి రాజుని చేయడం మాత్రమే కాకుండా, నా కూతుర్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానంటారు.అందులో ఒక్కడు తప్ప మిగిలిన సభ్యులందరూ జట్టుగా ఏర్పడి ఆ పులిని పట్టుకోవాలనుకుంటారు.

కాని మిగిలిన ఒక్కడికి ఆ పులి.ఆ పులి కన్నుతప్ప ఇంకేమీ కనిపించవు.

తన కసి పట్టుదలతో పులిని వేటాడి వేటాడి పట్టుకోవాలని కసితో పోరాడుతాడు.ఇది గమనించిన మిగిలిన వేటగాళ్లు మనం వేటాడాల్సింది పులిని కాదు.

ఆ పులిని వేటాడుతున్న ఆ ఒక్క వేటగాడ్ని అంటూ ఆ వేటగాడిపై వరుస బాణాలు వదులుతారు.

ఆ బాణాలు తగిలి ఒరిగిపోతాడు.రక్తం కారుతున్నా.తన వేటను ఆపేయడు.

ఈ పోరాటాన్నంతా జనం చూస్తూ ఉంటారు.ఆ జనం మధ్యలో ఉన్న లల్లీ అనే రెండేళ్ల పాప లే.నువ్ పోరాడు అంటూ ప్రోత్సహిస్తుంది.ఆమెతో పాటు జనం కూడా లేచి పోరాడాలని ప్రోత్సహిస్తారు.

జనం స్పందన చూశాక మిగిలిన వేటగాళ్లు కూడా లే అంటూ కేకలు వేస్తారు.ఆ శబ్ధం ఆ వేటగాడిలో చలనం ఇస్తుంది.

గుండెల్లో గుచ్చుకున్న బాణాలను తీసి పులిని పట్టుకుంటాడు.చివరికి ఆ పులి అతడికి లొంగిపోతుంది.

రాజు ఆ వేటగాడికి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేస్తారు’ ఇదీ బిగ్ బాస్ హౌస్‌‌లో కౌశల్ తనను గురించి తాను నానితో చెప్పిన కథ.ఈ కథలో సారాంశం ఏంటంటే.బిగ్ బాస్ ఆటలో వేటా నాదే.ఆటా నాదే.బిగ్ బాస్ టైటిల్ నాదే అంటూ చెప్పకనే చెప్పాడు కౌశల్.అదే ఇప్పుడు నిజమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube