వ్యవసాయం( agriculture )లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు అనవసరంగా అధిక మొత్తంలో రసాయన ఎరువుల వాడకం( Chemical fertilizers ) చేస్తున్నారు.రసాయన ఎరువులు వాడడం వల్ల ప్రస్తుతం పంట దిగుబడి పెరిగిన.
క్రమేనా నేల భూస్వారం కోల్పోవడంతో పాటు పర్యావరణ కాలుష్యం అధికంగా పెరుగుతుంది.అయితే కొంతమంది రైతులు జీవన ఎరువుల వాడకానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆశించిన స్థాయిలో దిగుబడులను పొందుతున్నారు.
జీవన ఎరువులు మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.జీవన ఎరువుల వల్ల భూమిలో సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది.
ఇలా జరగడం వల్ల రసాయన ఎరువుల వాడకం చాలావరకు తగ్గించుకోవచ్చు.
జీవన ఎరువులను( Living fertilizer ) నాలుగు పద్ధతులలో ఉపయోగించుకోవచ్చు.
ఆ పద్ధతులు ఏమిటో చూద్దాం.విత్తన శుద్ధి: మిరప, మొక్కజొన్న, జొన్న, గోధుమ, వేరుశనగ లాంటి పంట విత్తనాలను జీవన ఎరువుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.10 కిలోల విత్తనాల( seeds )కు, 200 గ్రాముల జీవన ఎరువు అవసరం.ఈ జీవన ఎరువును విత్తనాలకు పట్టించి ఒక గంట నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుక్కోవాలి.

ముందుగా 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లం కలిపి వేడి చేసి జిగురుగా మారిన తర్వాత అందులో 200 గ్రాముల జీవన ఎరువును కలపాలి.ఈ ద్రావణంను విత్తనం పైన పొరలాగా ఏర్పడేలాగా చేయాలి.నారును ముంచి వాడే పద్ధతి: ఒక కిలో జీవన ఎరువు ప్యాకెట్ ను 10 లీటర్ల నీటిలో బాగా కలపాలి.ఈ మిశ్రమంలో నారును కాసేపు ముంచి ఉంచి ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

నేల ద్వారా లేదా భూమిలో చల్లుట: 50 కిలోల పశువుల ఎరువు కు ఐదు కిలోల జీవన ఎరువులు కలిపి ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.అదే 100 కిలోల పశువుల ఎరువు కు 10 కిలోల జీవన ఎరువు కలపాలి.ఈ ఎరువును నేల ద్వారా లేదా భూమిపై చల్లుట ద్వారా పంటకు అందించవచ్చుడ్రిప్ పద్ధతి: 500 గ్రాముల జీవన ఎరువును, 300మి.లీ నీటిలో కలిపి డ్రిప్ ట్యాంక్ ద్వారా మొక్కలు నాటిన వారం రోజులలో పంటకు అందించాలి.
ఈ పద్ధతులు పాటిస్తే జీవన ఎరువుల మొక్కలకు పుష్కలంగా లభించి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.