విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.
కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి భూములు అప్పగించిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.అయితే దాదాపు 20 ఏళ్ల క్రితం మత్స్యకారులు భూములు ఇవ్వగా ఇంతవరకూ తమ హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు.
కాగా కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో ఒక్కో కుటుంబానికి 60 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.లక్ష నగదు పరిహారం ఇస్తామని పోర్టు యాజమాన్యం హామీ ఇచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు.దాంతోపాటు ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారంటున్న నిరసనకారులు హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతున్నారు.ఈ క్రమంలో ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో కంటైనర్ టెర్మినల్ వెళ్లే ప్రధాన మార్గం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.







