దేశ ప్రజలు బుర్రలేనివాళ్లు అనుకుంటున్నారా.. ఆదిపురుష్ టీంకు హైకోర్టు భారీ షాకిచ్చిందిగా!

ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) విడుదలై 11 రోజులైనా ఈ సినిమాపై వివాదాలు మాత్రం ఆగడం లేదు.ఈ సినిమా వల్ల మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ చాలామంది కోర్టులను ఆశ్రయిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 High Court Sensational Comments About Adipurush Movie Details, Adipurush Movie,-TeluguStop.com

అయితే అలహాబాద్ హైకోర్టు( Allahabad High Court ) ఆదిపురుష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.దేశ ప్రజలు బుర్రలేనివాళ్లు అనుకుంటున్నారా అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

వేర్వేరుగా దాఖలైన పిటిషన్ల గురించి కోర్టు స్పందిస్తూ డిస్ క్లెయిమర్ లో రామాయణ గాథ కాదని అన్నట్టు పేర్కొన్నారని రాముడి, లక్ష్మణుడు, రావణుడు, సీత, హనుమాన్ పాత్రలను చూపించి రామాయణ గాథ కాదని చెబుతారా అని హైకోర్టు పేర్కొంది.ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ విషయంలో విషయంలో సైతం హైకోర్ట్ అభ్యంతరాలను తెలియజేసింది.

ఈ విషయంలో సెన్సార్ బోర్డ్( Censor Board ) తీరును కోర్టు తప్పుబట్టింది.

Telugu Adipurush, Allahabad, Censor Board, Kriti Sanon, Om Raut, Prabhas, Ramaya

ఇలాంటి సినిమాలు, డైలాగ్స్ వల్ల భవిష్యత్తు తరాలకు ఏం నేర్పించాలని అనుకుంటున్నారని కోర్టు కామెంట్లు చేయడం గమనార్హం.ఈ సినిమాలో సీత, హనుమంతుని పాత్రలను మరోలా చూపించారని సెన్సార్ బోర్డ్ మొదట్లోనే ఆ సన్నివేశాలను తొలగించి ఉంటే బాగుండేదని హైకోర్టు వెల్లడించింది.ఇలాంటి సీన్స్ ను సెన్సార్ బోర్డ్ మొదట్లోనే తొలగించి ఉంటే బాగుండేదని హైకోర్టు పేర్కొంది.

Telugu Adipurush, Allahabad, Censor Board, Kriti Sanon, Om Raut, Prabhas, Ramaya

ప్రజలు థియేటర్ల దగ్గరకు వెళ్లి మరీ ఆదిపురుష్ మూవీ ప్రదర్శనను ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారని హైకోర్టు వెల్లడించింది.మా సహనాన్ని పరీక్షించవద్దని కోర్టు వెల్లడించడం గమనార్హం.ఈ చిత్ర మాటల రచయిత మనోజ్ పేరును కూడా పిటిషన్ లో జోడించాలని హైకోర్టు పేర్కొనడం గమనార్హం.ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఈ వివాదాలకు ఆదిపురుష్ మేకర్స్ ఏ విధంగా చెక్ పెడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube