శామ్‌సంగ్ మొబైల్ యూజర్లకు హై-అలర్ట్.. ఈ రెండు యాప్స్ వెరీ డేంజరస్..?

ఆండ్రాయిడ్‌లో( Android ) హానికరమైన యాప్‌లు, గేమ్‌ల నుంచి ఫోన్లను రక్షించే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.వాటిలో చాలా ముఖ్యమైనది గూగుల్ ప్లే ప్రొటెక్ట్.

ఇది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను స్కాన్ చేస్తుంది.మెసేజ్‌లు, ఫోటోలు లేదా కాల్ హిస్టరీ వంటి మీ పర్సనల్ డేటాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని హెచ్చరిస్తుంది.

అయితే, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ( Google Play Protect )ఇటీవల పొరపాటు చేసింది.రెండు శామ్‌సంగ్ యాప్‌లు ప్రమాదకరమైనవిగా ఫ్లాగ్ చేసింది.

వీటిని వెంటనే డిలీట్ చేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది.

High-alert For Samsung Mobile Users These Two Apps Are Very Dangerous, Google Pl
Advertisement
High-alert For Samsung Mobile Users These Two Apps Are Very Dangerous, Google Pl

ఆ యాప్స్ మరేవో కావు, బాగా పాపులర్ అయిన "శామ్‌సంగ్ మెసేజెస్",( Samsung Messages ) "శామ్‌సంగ్ వాలెట్"( Samsung Wallet ).ఇవి శామ్‌సంగ్ అఫీషియల్ యాప్‌లు, ఇవి ఫోన్‌తో టెక్స్ట్‌లను పంపడానికి, పేమెంట్స్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.అవి హానికరమైనవి కావు, డేటాను దొంగిలించవు.

కొంతమంది శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ యాప్‌ల గురించి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ నుంచి హెచ్చరికలను అందుకున్నారు.దీని వల్ల యాప్‌లు, వాటిని కనెక్ట్ చేసే సర్వర్‌లో కొన్ని సమస్యలు తలెత్తాయి.

కొంతమంది వినియోగదారులు యాప్‌లను సరిగ్గా ఉపయోగించలేకపోయారు.లేదా వారి మెసేజెస్, వాలెట్‌ను యాక్సెస్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

High-alert For Samsung Mobile Users These Two Apps Are Very Dangerous, Google Pl

గూగుల్ ఈ తప్పును సరిదిద్దింది, సర్వర్‌ను పునరుద్ధరించింది.యాప్‌లు సురక్షితంగా ఉన్నాయని, సాధారణంగా పని చేస్తున్నాయని శామ్‌సంగ్ కూడా కన్ఫామ్ చేసింది.శామ్‌సంగ్ మెసేజెస్ లేదా వాలెట్ యూజర్లు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ హెచ్చరికను చూసి భయపడాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

హెచ్చరికలను డిలీట్ చేసుకోమని కూడా సూచించింది.ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి ఫోన్‌ని రీసెట్ చేయవచ్చు లేదా గూగుల్ ప్లే స్టోర్ యాప్ కాచీ డేటాను క్లియర్ చేయవచ్చు.

Advertisement

ఫోన్‌ని రీసెట్ చేయడం లేదా కాచీ డేటాను క్లియర్ చేయడం వల్ల యాప్ డేటా ఏదీ తొలగించబడదు.ఇది నోటిఫికేషన్లు, పర్మిషన్స్, బ్యాక్‌గ్రౌండ్ డేటా యూసేజ్ వంటి యాప్‌ల డిఫాల్ట్ సెట్టింగ్స్‌ను మాత్రమే రీసెట్ చేస్తుంది.

మెసేజెస్ యాప్‌ని రీసెట్ చేయడం ద్వారా దాన్ని మళ్లీ ఉపయోగించవచ్చని శామ్‌సంగ్ హామీ ఇచ్చింది.ఫోన్‌లో గూగుల్ ప్లే ప్రొటెక్షన్ కూడా నిలిపివేయకుండా ఉండాలి.ఆ రెండు యాప్స్‌కు సంబంధించి వచ్చిన వార్నింగ్స్ మాత్రమే రిమూవ్ చేయాలి.

తాజా వార్తలు