Sriya Reddy Samantha : గుండు గీయించుకోవడం నుంచి బర్రెల తోమే దాకా సినిమాల కోసం హీరోయిన్లు చేసిన పనులివే..!

సాధారణంగా హీరోలు ఒక పాత్ర కోసం శరీరాకృతిని మార్చుకోవడానికి సిద్ధమవుతుంటారు.హీరోయిన్లు మాత్రం గ్లామర్ డాల్ గా కనిపించడానికి ప్రయత్నిస్తారు.

 Heroines Hard Word For Movies-TeluguStop.com

అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ స్టేటస్ మొత్తం పక్కన పెట్టేసి పాత్రలో ఒదిగి పోవడానికి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.ఒక హీరోయిన్ ఒక పాత్ర కోసం ఏకంగా గుండు గీయించుకుంటే, మరొక హీరోయిన్ ముక్కు కుట్టించుకుంది.

ఇంకా సమంత నుంచి అనుష్క దాకా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఆశ్చర్యపరిచారు.వారెవరో, ఏ పాత్రల కోసం ఆ పనులు చేశారో తెలుసుకుందాం.

Telugu Anushka, Ram Charan, Rangasthalam, Salaa, Samantha, Sapthami Gowda, Size

సలార్ సినిమాలో నటి శ్రేయ రెడ్డి( Sriya reddy ) మన్నార్‌ తెగ అమ్మాయిలా కనిపించిన విషయం తెలిసిందే.రాధా రామ మన్నార్‌గా ఈ ముద్దుగుమ్మ కొత్త అవతారంలో కనిపించింది.చెవులు, ముక్కు, మెడ అన్నిటికి ఆమె మన్నార్‌ అమ్మాయిలాగా కనిపించేందుకు రకరకాల ఆభరణాలు ధరించింది.అయితే కమ్మలు చాలాసార్లు ధరించడం తీసివేయడం వల్ల ఆమె చెవులు బాగా కిందకి సాగాయట.

గాయాలు కూడా అవ్వడం వల్ల ఆమె చెవులకు రెండు కుట్లు పడ్డాయని తెలిసింది.ఇక అనుష్క శర్మ కూడా “సైజ్ జీరో” సినిమాలోని పాత్ర కోసం తన శరీరంపై పెద్ద ప్రయోగం చేసింది.

డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా నిన్ను లావుగా చూపిస్తానని, రిస్క్ వద్దని చెప్పినా ఆమె ఒప్పుకోలేదు.పాత్రకు 100% న్యాయం చేయడానికి లావు అవుతానని చెప్పి లావు అయ్యింది.

తర్వాత లావు తగ్గడానికి చాలా ఇబ్బందులు పడింది.చాలా వరకు లావును తగ్గించుకో గలిగింది కానీ మునుపటిలాగా ఆమె అందంగా కనిపించడం లేదు.

Telugu Anushka, Ram Charan, Rangasthalam, Salaa, Samantha, Sapthami Gowda, Size

రంగస్థలం సినిమాలో సమంత( Samantha ) బర్రెలను తోమే సీన్ మనం చూసే ఉంటాం.ఈ సన్నివేశాలలో సమంత నిజమైన బర్రెల నేను తిప్పుతూ ఉంటుంది అంతేకాదు ఒక బురదగుంటలోకి దిగి వాటిని శుభ్రం చేస్తుంది.సాధారణంగా ఏసీ గదులు, కార్లలో తిరిగే హీరోయిన్లు ఎన్నడూ ఇలా బురదలోకి దిగి బర్రెలను కడగరు.డూప్ తో మెయింటైన్ చేసేస్తారు కానీ సమంత మాత్రం తన అన్ని సీన్లు నేచురల్ గా రావాలని పట్టుబట్టి మరీ బర్రెలతో గడిపింది.

Telugu Anushka, Ram Charan, Rangasthalam, Salaa, Samantha, Sapthami Gowda, Size

కోడి వీరన్‌లో తన పాత్ర కోసం హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్ ఏకంగా గుండు గీయించుకుంది.క్లీన్ షేవ్ చేయించుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు కానీ పూర్ణ పాత్ర కోసం ఆ పని చేసి తన డెడికేషన్ ఎలా ఉంటుందో చూపించింది.కాంతార సినిమాలోని హీరోయిన్ సప్తమి గౌడ అడవిలో నివసించే అమ్మాయిలాగా కనిపించడానికి ఏకంగా ముక్కు కుట్టించుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube