సినిమాల ద్వారా తాప్సీ ఎంత సంపాదించిందో తెలుసా?

తాప్సీ. తన సొట్టబుగ్గల రూపంతో పాటు చక్కటి నటనతో మంచి నటిగా గుర్తింపు పొందింది.

తెలుగులో పలు సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా కొనసాగింది.ప్రస్తుతం బాలీవుడ్ లో చేరి.

పలు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తుంది.నటిగా మంచి అవకాశాలను పొందుతూ ముందుకు సాగుతోంది.

ఈ క్యూట్ బ్యూటీ కె.రాఘ‌వేంద్ర‌రావు దర్శకత్వంలో రూపొందిన ఝ‌మ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది.

Advertisement
Heroine Taapsee Pannu Assets Worth, Taapsee Pannu,Taapsee Assets, Taapsee Remue

నెమ్మదిగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ బాట పట్టింది.ఆమె చివరగా గతాడాది థప్పడ్ అనే సినిమాతో జనాల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు సర్వత్రా ప్రశంసలు లభించాయి.ప్రస్తుతం తను నటించిన 5 సినిమాలు విడుదలకు రెడీ గా ఉన్నాయి.

మరో మూడు సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

Heroine Taapsee Pannu Assets Worth, Taapsee Pannu,taapsee Assets, Taapsee Remue

టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న తాప్సీ.బాగానే ఆస్తులు కూడబెట్టింది.ఓ ఫైనాన్సియల్ రిపోర్టు ప్రకారం 2019 వరకు తాప్సీ దగ్గరున్న ఆస్తుల విలువ 42.5 కోట్లుగా తేలింది.ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 80 లక్షల నుండి 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటుంది.బాగానే డబ్బులు సంపాదిస్తున్న తాప్సీ.

న్యూస్ రౌండప్ టాప్ 20

కొంత కాలం క్రితం ముంబైలోని పాష్ ఏరియాలో ఓ లగ్జరీ అపార్ట్ మెంట్ సొంతం చేసుకుంది.అటు ఈ ముద్దుగుమ్మకు హైద‌రాబాద్‌, చెన్నైలోనూ అపార్ట్‌ మెంట్లు ఉన్నాయి.

Advertisement

తాప్సీ దగ్గర పలు లగ్జరీ కార్లున్నాయ.బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యువి, రెనాట్ క్యాప్టూర్ కార్లు తన గ్యారేజీలో ఉన్నాయి.

ఈ సొట్టబుగ్గల సుందరిన బ్యాడ్మింటన్ స్టార్ మాథియాస్ బోతో డేటింగ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పలేదు.

ప్రస్తుతం తాప్సీ.హ‌సీనా దిల్‌రుబా, జ‌న‌గ‌ణ‌మ‌న, ర‌ష్మీ రాకెట్, లూప్ ల‌పేటా, దోబారా సినిమాల షూటింగ్స్‌ కంప్లీట్ చేసింది.ఈ సినిమాలు రీలీజ్ కు రెడీ అయ్యాయి.

అటు అన్నాబెల్లే సుబ్ర‌మ‌ణియ‌న్, ఏలియ‌న్, శ‌భాష్ మిథు సినిమాల షూటింగ్ కొనసాగుతుంది.

తాజా వార్తలు