టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస హిట్లతో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకుని రష్మిక, పూజా హెగ్డే సినిమా ఛాన్సులతో బిజీగా ఉన్నారు.స్టార్ హీరోలు ఇతర స్టార్ హీరోయిన్లతో ఇప్పటికే కలిసి నటించడంతో రష్మిక, పూజా హెగ్డేలకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.
అయితే ఫిదా సినిమాతో ఫిదా చేసిన సాయిపల్లవి తెలుగులో వరుస సినిమాలకు కమిటవుతూ రష్మిక, పూజా హెగ్డేలతో పోలిస్తే ఎక్కువ ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఆ ఇద్దరు హీరోయిన్లకు ఝలక్ ఇచ్చిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రష్మిక, పూజా హెగ్డేలతో పోల్చి చూస్తే సాయిపల్లవి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉండటం, నటన ద్వారా ప్రేక్షకుల్లో సాయిపల్లవి భారీస్థాయిలో గుర్తింపు దక్కించుకోవడం ఆమెకు ప్లస్ అయింది.
ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో తెలుగులో ఏకంగా 5 సినిమాలు ఉన్నాయంటే ఆమె అవకాశాలతో ఎంత బిజీగా ఉన్నారో సులభంగానే అర్థమవుతుంది.సాయిపల్లవి కొత్త కథలు కూడా వింటున్నారని త్వరలో మరికొన్ని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సాయిపల్లవి నటిస్తున్న సినిమాలన్నీ కూడా భారీ సినిమాలే కావడం గమనార్హం.ప్రస్తుతం మిడిల్ రేంజ్ హీరోలంతా తమ సినిమాల్లో సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.రానా హీరోగా తెరకెక్కుతోన్న విరాటపర్వం, నాగచైతన్యకు జోడీగా లవ్ స్టోరీ, నానికు జోడీగా శ్యామ్ సింగరాయ్, కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా, పవన్ రానా హీరోలుగా తెరకెక్కుతోన్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా తెలుగులో పరిమితంగానే సినిమాల్లో నటిస్తున్న సాయిపల్లవి 5 సినిమాల్లో నటిస్తూ ఉండటం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.2021 సంవత్సరంలో సాయిపల్లవి నటిస్తున్న సినిమాలన్నీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.నటిస్తున్న 5 సినిమాలలో కనీసం మూడు సినిమాలు హిట్టైనా సాయిపల్లవి టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.







