Rashmika Mandanna: అర్ధరాత్రి ఆ పని చేస్తూ తెగ కష్టపడుతున్న రష్మిక.. మరి ఇంత పిచ్చి ఏంటి?

రష్మిక మందన్న (Rashmika Mandanna) పరిచయం అవసరం లేని పేరు నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మిక భాషకి సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ప్రస్తుతం ఈమె సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీ అయ్యారు.

 Heroine Rashmika Mandanna Midnight Workouts In Gym Pics Viral-TeluguStop.com

ఇటీవల రష్మిక నటించిన యానిమల్( Animal ) సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం రష్మిక పుష్ప( Pushpa )సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్ రెయిన్ బో వంటి సినిమాలలో కూడా ఈమె నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu Animal, Mid, Pushpa, Rashmika, Rashmikagym, Tollywood, Outs-Movie

ఇలా సినిమాల పరంగా క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా గడిపే రష్మిక ఫిట్నెస్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ కారనే సంగతి మనకు తెలిసిందే.ఈమె తనకు వీలు దొరికినప్పుడల్లా పెద్ద ఎత్తున వర్కౌట్స్( Workouts ) చేస్తూ జిమ్ లోనే గడుపుతూ ఉంటారు.ఇలా భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తూ ఎంతో ఫిట్ గా ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మిక తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

Telugu Animal, Mid, Pushpa, Rashmika, Rashmikagym, Tollywood, Outs-Movie

రష్మిక తరచూ తన సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వర్కౌట్స్ కి సంబంధించిన విషయాలు అలాగే అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.అయితే తాజాగా ఈమె జిమ్ లో( Gym ) వర్క్ అవుట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.ఈ ఫోటోకి మిడ్నైట్ వర్క్ అవుట్ అంటూ ఈ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇలా అర్ధరాత్రి పూట( Mid Night ) కూడా ఈమె కష్టపడుతూ తెగ వర్కౌట్ లు చేస్తూ ఉండటం గమనార్హం.

Telugu Animal, Mid, Pushpa, Rashmika, Rashmikagym, Tollywood, Outs-Movie

ఇలా అర్ధరాత్రి సమయంలో రష్మిక వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఫోటో పైన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఫిట్నెస్ విషయంలో ఈమె తీసుకుంటున్నటువంటి శ్రద్ధ చూసి అందరూ ఫిదా అవ్వగా మరికొందరు మాత్రం మరి అర్ధరాత్రి కూడా జిమ్ లో గడపడం ఏంటి మరి ఇంత పిచ్చి ఏంటి అంటూ ఈమె ఫోటోపై కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube