రష్మిక శెట్టి…. ఆమె ప్రస్తుతం కన్నీళ్లు పర్యంతమవుతోంది.
ట్రోల్లర్స్ చేస్తున్న దాడితో ఆమె ఉక్కిరి బిక్కిరి అవుతుంది.ఆమెపై వారు ఉపయోగిస్తున్న భాషను చూసి ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నిజానికి జర్నలిస్ట్ ప్రేమకు ఇంటర్వ్యూ ఇస్తూ రష్మిక బరస్ట్ అయిపోయింది.అయినా కూడా ఆమెను త్రొల్లర్స్ విడిచిపెట్టరు.
ప్రస్తుతం జరిగిన తప్పేంటో, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏంటో ఆమెకు తెలిసి వచ్చింది.
చిన్న చిన్న విషయాలను కూడా టార్గెట్ చేస్తూ ఆమెను వేధిస్తున్న మాట కూడా వాస్తవమే.
కాంతారా సినిమా చూడలేదు అని చెప్పిన ఒక్క మాటతో మొదలైంది ఈ ఆన్లైన్ యుద్ధం.అసలు తనపై వచ్చే కామెంట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో రష్మికకు అర్థం కాలేదు.
పూర్తిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆ తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
కిరిక్ పార్టీ నాకు జీవితాన్ని ఇచ్చింది, రిషబ్ శెట్టి నాకు అవకాశం ఇచ్చాడు అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది.అలా తీసిపారేసినట్టుగా మాట్లాడటం ఎందుకు ఇప్పుడు సరిదిద్దుకోవడం ఎందుకు అంటూ మళ్లీ మొదలుపెట్టారు సోషల్ మీడియా.
పైగా రష్మిక నిజంగానే బాధపడుతోంది, ఆమెకు మానసికంగా ఎంతో హింసకు గురవుతున్న ఫీలింగ్ వస్తోంది.కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోతోంది.ఆమె చెప్తున్న మాటల్లో అర్థం కూడా ఉంది.నేను జిమ్ చేసి ఫిట్ గా కనిపిస్తే మగాడిలా ఉన్నానంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాస్త జిమ్ చేయక లావయితే డ్రమ్ములా ఉన్నాను అంటూ ముద్ర వేస్తారు.మాట్లాడితే వదలరబోతులా కనిపిస్తున్నాను,
పూర్తిగా మాట్లాడకుండా ఉంటే ఇగోయిస్టు అంటూ పేరు పెట్టేస్తున్నారు.వీటి దెబ్బకు ఊపిరి పీల్చుకోవడం కూడా నాకు కష్టంగా ఉంది అంటూ ఆమె బాధను వెళ్ళుచుకుంటుంది.ఇప్పుడు కూడా ఇలా మాట్లాడి రష్మిక తప్పు చేస్తోంది.
ఏం జరిగినా కూల్ గా ఉండాలి అంతే కానీ తలవంచినా కూడా సోషల్ మీడియా ఆమె పై స్వారీ చేసే అవకాశం ఉంటుంది.అలా అని ఇగోయిస్టు గా మారకుండా సామరస్యంగా మాట్లాడుతూ వెళ్లాల్సిన అవసరం ఆమెకు ఎంతో ఉంది.