టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ ఇంకా బాలీవుడ్ లో సందడి చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.( Rakul Preeth Singh ) ఈ అమ్మడు తెలుగు లో ఒకానొక సమయంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీగా ఉండేది.
ఆ సమయంలో చాలా మంది హీరోలు ఈమె డేట్ల కోసం తమ సినిమా ల డేట్ల ను సర్ధుబాటు చేసుకున్నాడు.బాలీవుడ్ లో( Bollywood ) కూడా ఈ అమ్మడి జోరు కొన్నాళ్ల పాటు కొనసాగింది.
ఏడాదికి అయిదు నుండి ఏడు సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.టాలీవుడ్ లో ఆఫర్లు లేవు.
బాలీవుడ్ నుండి పిలుపు లేదు.

కోలీవుడ్ లో ఈమెను పట్టించుకోవడం లేదు.ఇలాంటి సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ మహారాష్ట్ర లో( Maharashtra ) జరిగిన ఒక పొలిటికల్ ఈవెంట్ లో ( Political Event ) కనిపించడం తో చాలా మంది అవాక్కవుతున్నారు.గతంలో చాలా సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఇంతటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవడం దారుణం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోత ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోల వల్ల ఇంకా కూడా ఈమె కెరీర్ ను( Rakul Career ) కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అంటూ అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇప్పటి వరకు కూడా రకుల్ ను ఏ తెలుగు నిర్మాత సంప్రదించలేదు.వచ్చే ఏడాది లో అయినా రకుల్ కు ఓ ఆఫర్ వస్తుందా అనేది చూడాలి.
ఏదో ఒక భాష లో ఏదో ఒక సినిమా లో ఛాన్స్ వస్తే ఆ సినిమా సక్సెస్ అయితే వెనక్కి తిరిగి చూసుకోకుండా రెండు మూడు సంవత్సరాల పాటు భారీ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







