అలాంటి ఫోటో షేర్ చేయమన్న నెటిజన్.. ప్రియమణి ఏం చేశారంటే..?

ఈ మధ్య కాలంలో కొంతమంది నెటిజన్లు హద్దులు దాటుతూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలంటే ఇబ్బంది పడేలా చేస్తున్నారు.అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చేస్తున్నారు.

 Heroine Priyamani Shocking Comments On Netizen Question , Heroine Priyamani, Mu-TeluguStop.com

అందం, అభినయం పుష్కలంగా ఉన్న టాలీవుడ్ హీరోయిన్లలో ప్రియమణి ఒకరనే సంగతి తెలిసిందే.తమిళంలో ప్రియమణి నటించిన ఒక సినిమాకు జాతీయ అవార్డు లభించింది.

ఈ మధ్య కాలంలో ప్రియమణికి హీరోయిన్ ఆఫర్లు తగ్గినా టీవీ షోలకు ప్రియమణి జడ్జిగా వ్యవహరించడంతో పాటు అడపాదడపా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం నటిగా గుర్తింపును సంపాదించుకున్న ప్రియమణి 2017 సంవత్సరం ముస్తఫారాజ్ ను వివాహం చేసుకొని పెళ్లి తరువాత కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రియమణి బ్లాక్ డ్రెస్ లో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

Telugu Priyamani, Mustafa Raj, Netizen, Priyamani Black, Virata Parvam-Movie

అయితే ఆ ఫోటోలను చూసిన ఒక నెటిజన్ ప్రియమణి నగ్న ఫోటో కావాలంటూ కామెంట్ పెట్టాడు.ఆ కామెంట్ చూసిన ప్రియమణి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.మొదట మీ మదర్ లేదా సిస్టర్ ను అలాంటి ఫోటో పోస్ట్ చేయమని చెప్పండి ఆ తర్వాత తాను ఫోటో షేర్ చేస్తానంటూ ప్రియమణి కామెంట్ పెట్టగా ఆ నెటిజన్ సారీ మేడమ్ అంటూ సమాధానం ఇచ్చారు.

నెటిజన్ కు బుద్ధి వచ్చేలా సమాధానం చెప్పిన ప్రియమణిని మిగతా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

నెటిజన్లు చేసిన కామెంట్లకు తన శైలిలో జవాబులు ఇస్తూ ప్రియమణి వార్తల్లో నిలుస్తున్నారు.

ప్రియమణి కీలక పాత్రలో నటించిన విరాటపర్వం సినిమా ఏప్రిల్ లో విడుదల కానుండగా నారప్ప సినిమా మే నెలలో విడుదల కానుంది.ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube