రెండేళ్ల క్రితం ఈ అమ్మడి యొక్క డైరీ మొత్తం ఫుల్ బిజీగా ఉంది.ఈమె స్టార్ హీరోల సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది.
హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అలరించింది.మొత్తానికి పూజా హెగ్డే( Pooja Hegde ) ఆ సమయంలో ఫుల్ బిజీగా గడిపింది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పూజా హెగ్డే సినిమాలు చేసుకుంటూ అందాల ఆరబోత చేస్తూ కుమ్మేసింది.అందుకే పూజా హెగ్డే అందరు హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది.
అందుకే ఈమె పారితోషికం కూడా భారీ ఎత్తున డిమాండ్ చేసింది.

చాలా మంది హీరోయిన్స్ ఈమె తో పోటీ పడేందుకు కష్టపడ్డారు.కానీ ఒక్కసారిగా ఈ అమ్మడి క్రేజ్ తగ్గింది.గుంటూరు కారం సినిమా లో నటిస్తున్నాను.
ఆ సినిమా తో మళ్లీ తనకు పూర్వ వైభవం వస్తుందని భావించింది.కానీ మహేష్ బాబు( Mahesh Babu ) ఆ సినిమా లో నుంచి ఈమెను తప్పించాడు.
దాంతో ఈమెకు వరుసగా నిరాశే మిగులుతోంది.హిందీ లో కూడా ఒక పెద్ద సినిమా ఆఫర్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది.
ఆ విషయం పక్కన పెడితే ఇంకా కూడా ఈమె తనకు ఆఫర్లు వస్తాయి అనే నమ్మకంతో కనిపిస్తోంది.అందుకే సోషల్ మీడియా లో ఈ అమ్మడు కుమ్మేస్తోంది.

పెద్ద ఎత్తున హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చి పోతోంది.ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియో లను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తోంది.ముందు ముందు ఈమెకు కచ్చితంగా సినిమా ల్లో బిజీ అయ్యేంతగా ఆఫర్లు వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే బాలీవుడ్( Bollywood ) లో ఈ అమ్మడు వరుస సినిమా లు చేయాల్సి ఉంది.
కానీ అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఈ అమ్మడు పెద్దగా ప్రభావం చూపించలేక పోతుంది.హాట్ ఫోటోలతో అయినా అనుకున్నది సాధించేనా చూడాలి.







