మెగా డాటర్ నిహారిక( Niharika Konidela ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నాగబాబు ( Nagababu ) కుమార్తెగా ఇండస్ట్రీలో యాంకర్ గా అందరికీ పరిచయమయ్యారు.
ఇలా యాంకర్ గా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి నిహారిక అనంతరం హీరోయిన్గా నటించారు.ఇలా ఈమె మూడు సినిమాలలో హీరోయిన్గా నటించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా సక్సెస్ అందించలేకపోయింది.
ఇలా నిహారిక నటించిన సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈమె పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు.తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య( Jonnalagadda Venkata Chaitanya )తో తనకు వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈమె విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇలా విడాకులు తీసుకున్నటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మొదటిసారి విడాకుల గురించి మాట్లాడారు.ఎవరు కూడా ఒక సంవత్సరానికే వెళ్లిపోతామని పెళ్లి చేసుకోరు కదా అంటూ పరోక్షంగా తన విడాకులపై స్పందించారు.
అంతేకాకుండా పెళ్లి అయిన అమ్మాయిలు నటించకూడదా అంటూ కూడా ప్రశ్నించారు.
![Telugu Divorce, Niharika, Tollywood-Movie Telugu Divorce, Niharika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/07/Niharika-Konidela-Chaitanya-Jonnalagadda-Divorced.jpg)
నిహారిక ఇలా మాట్లాడటంతో ఈమె ఇండస్ట్రీలోకి రావాలని కోరికగా ఉన్నప్పటికీ తన అత్తింటి వారు అడ్డు చెప్పారని అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అర్థమవుతుంది.ఇక భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు .నిర్మాతగా( Producer ) మారడమే కాకుండా తెలుగే హీరోయిన్గా కూడా సినిమాలలో నటించడానికి సిద్ధమవుతున్నారు.కేవలం తెలుగు సినిమాలు కాకుండా మలయాళ సినిమాలలో కూడా ఈమె నటిస్తున్న సంగతి తెలిసిందే.
![Telugu Divorce, Niharika, Tollywood-Movie Telugu Divorce, Niharika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/11/latest-news-viral-about-niharika-detailssa.jpg)
ఇలా హీరోయిన్ గా రీ ఎంట్రీ( Re Entry as Heroine ) ఇస్తున్నటువంటి నిహారిక పెద్ద ఎత్తున ఫోటో షూట్ లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈమె ఒక బోల్డ్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.బ్లాక్ స్లీవ్ లెస్ స్కిన్ టైట్ డ్రెస్( Black Sleeveless Skin Tight Dress ) లో ఫోటోషూట్ నిర్వహించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి ఈ ఫోటోలను నిహారిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్లై విత్ మీ అంటూ క్యాప్షన్ పెట్టారు.ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
![Telugu Divorce, Niharika, Tollywood-Movie Telugu Divorce, Niharika, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/02/Niharika-Konidela-Latest-Black-Sleeveless-Dress-Photoshoot-Viral-Social-Media.jpg)
ఇక ఈ ఫోటోల పై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.కొందరు నేటిజన్స్ ఈమెకు ఆల్ ద బెస్ట్ తెలియజేయగా మరికొందరు మాత్రం నువ్వు హీరోయిన్ గా కాకపోతేనే జనాలు చాలా లక్కీగా ఫీల్ అవుతారు.నువ్వు ఆ మంచు లక్ష్మి ఇద్దరు ఒకటే అంటూ నిహారిక విషయంలో మంచు లక్ష్మి పట్ల కూడా నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.