స్లో అండ్ స్టడీ అంటున్న గ్లామర్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్

2022 లో డైరెక్టర్ హనురాఘవాపుడి – స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ మూవీ సీతారామం. ఇక ఈ మూవీ లో మొదటగా హీరోయిన్స్ గా పలువురు పేర్లు అనుకున్న ఫైనల్ గా నిర్మాత స్వప్నదత్ సలహాతో బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసింది మూవీ యూనిట్.

 Heroine Mrunal Thakur Movies Selection Details, Mrunal Thakur , Viral News,-TeluguStop.com

ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ ,సాంగ్స్, డైరెక్టర్ హను టేకింగ్ ,దుల్కర్ యాక్టింగ్ ,మృణాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ,ట్రైలర్స్ ,టీజర్స్ ,తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం అందుకుంది.ఇక అసలు విషయానికి వస్తే.

సీతా రామం మూవీ విజయంతో బాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ మృణాల్ కు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

తన అందం అభినయంకు స్టార్ హీరోస్ ఫిదా అయిపోయారు .టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురుంచి ఇంతాలా మాట్లాడుకుంటున్నారు అంటే అది కేవలం ఓవర్ నైట్ వచ్చిన సక్సెస్ కాదు .ఇక మృణాల్ ఠాకూర్ 2012లో ముజ్సే కుచ్ కెహెతి.ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించి ,2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.ఇక “విట్టి దండు” అనే మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస ఆఫర్స్ వచ్చాయి .ఇక గ్యాప్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మూవీస్ చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Telugu Dulquer Salman, Nani, Mrunal Thakur, Sitaramam-Latest News - Telugu

ఇక సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఈ మూవీ లో మృణాల్ చేసిన సీతామహాలక్ష్మి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .సీతారామాం సినిమాతో ప్రేక్షకుల దగ్గర నుండి ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ ,ప్రోడుసుర్స్ అందరి దృష్టి ని తమవైపుకు తిప్పుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ .ఇప్పటికే నేచురల్ స్టార్ నాని సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది ఈ భామ.న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న 30వ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయిన సంగతి అందరికి తెలిసిందే.ఇక మృణాల్ ఠాకూర్ తన కధల వినే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu Dulquer Salman, Nani, Mrunal Thakur, Sitaramam-Latest News - Telugu

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అలోచించి అడుగులు వెయ్యాలి.ఇక తాజగా ఈ ముద్దుగమ్మ కు సంబందించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది .అది ఏమిటంటే ఒక మెగా హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే మృణాల్ నో చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మెగా హీరో సినిమా ఆఫర్ వస్తే కథ నచ్చలేదు సినిమాను ఒప్పుకోలేదు అని టాక్ గట్టిగా వినిపిస్తుంది .ఇక ఫైనల్ గా ఈ వార్తలకు స్పందించిన మృణాల్ అసలు నా దగ్గరకు ఏ కధ రాలేదు.నిజంగా మెగా హీరోతో సినిమా లో నటించే అవకాశం వస్తే ఎందుకు ఒప్పుకోను ఖచ్చితంగా ఒప్పుకుంటాను,కెరిర్ లో పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం ఎవ్వరు వదులుకోరు అని గట్టిగా సమాధానం ఇచ్చి తన పై వస్తున్న రూమర్స్ కు ఫుల్ క్లారిటీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube