Varun Tej Manushi Chhillar VT13: వరుణ్ తేజ్ 'VT13' కోసం బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లోకి మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

కానీ ఈయన మెగా ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా విభిన్నమైన సినిమాలను చేస్తూ తన నటనలో కూడా వేరియేషన్స్ చూపిస్తు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు.

గడ్డలకొండ గణేష్ తో బాగా ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఇటీవలే గని, ఎఫ్ 3 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇందులో గని ప్లాప్ అవ్వగా మళ్ళీ వెంటనే ఎఫ్ 3 సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు.

ఇక ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకుని తన 13వ సినిమాను అనౌన్స్ చేసాడు.వరుణ్ తన 12వ సినిమాను ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు.

ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసి రెగ్యురల్ షూట్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమా స్టార్ట్ చేయకుండానే 13వ సినిమా ప్రకటించాడు.

Advertisement

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాను

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కించ బోతున్నారు.ఇటీవలే జరిగిన పలు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్ గురించిన అప్డేట్ ఒకటి వచ్చింది.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ను ఫిక్స్ చేసినట్టు టాక్.

ప్రెజెంట్ ప్రవీణ్ సత్తారు సినిమాతో బిజీగా ఉన్న ఈయన త్వరలోనే ఈ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్లబోతున్నాడు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు
Advertisement