సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు.ఈ నేపథ్యంలోనే వారి వయసు మూడు పదుల వయసు దాటుతున్న కూడా పెళ్లి అనే విషయం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.
ఇలా ఇండస్ట్రీలో మూడు పదుల వయసు దాటినటువంటి ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారి ఫోకస్ మొత్తం సినిమాల పైన పెడుతున్నారు.ఇలాంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి కూడా ఒకరు.
అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లావణ్య త్రిపాఠి ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె తన పెళ్లి గురించి తరచూ వార్తలో నిలుస్తున్నారు.ఈమె మిస్టర్ అనే సినిమా ద్వారా మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించారు.ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇలా వీరి పెళ్లి వార్తల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.అయితే ఈ వార్తలను లావణ్య త్రిపాఠి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు.ఇకపోతే తాజాగా ఈమె నటించిన పులి మేక వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ టాక్ షోలో పాల్గొన్నటువంటి ఈమె మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు అని ప్రశ్నించడంతో వెంటనే వరుణ్ తేజ్ పేరు చెప్పడం గమనార్హం.

ఈ విధంగా ఈమె వరుణ్ తేజ్ గురించి చెప్పడంతో మరోసారి వీరి గురించి చర్చలు జరుగుతున్నాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె మరోసారి పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ… తనని పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు కూడా ఒత్తిడి తీసుకు వస్తున్నారని తెలియజేశారు.
అయితే ప్రస్తుతం తన ఫోకస్ పెళ్లిపై లేదని సినిమాల పైన తన దృష్టి మొత్తం ఉందని ఈమె తెలియజేసారు.ఇకపోతే పెళ్లి తప్పనిసరిగా చేసుకుంటాను కానీ నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే తన పెళ్లి జరుగుతుందని ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







