ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నప్పటి స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన "నేను శైలజ" అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై అలనాటి అందాల తార మరియు స్వర్గీయ నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన మహానటి సావిత్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయి ప్రేక్షకులను తన నటనతో కంట తడి పెట్టించిన హీరోయిన్ కీర్తి సురేష్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.

అయితే సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే ఇటీవలే రాఖీ పౌర్ణమి సందర్భంగా గా తన సోదరితో కలిసి చిన్నప్పుడు దిగినటువంటి ఫోటోని తన అధికారికా ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.తన అభిమానులు అందరికీ రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

దీంతో కొందరు నెటిజన్లు కీర్తి సురేష్ చిన్నప్పటి ఫోటోనీ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక చిన్నప్పుడు కీర్తి సురేష్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొందరు రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అయితే ఈ విషయంలో ఇలా ఉండగా ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో హీరో నితిన్ హీరోగా నటిస్తున్న రంగ్ దే అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు