నటులుగా పనికి రారు అని కామెంట్స్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పిన హీరోలు..?

సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలుగా రాణించాలి అనే ఒకే ఒక టార్గెట్ పెట్టుకొని ఇండస్ట్రీ కి వస్తారు అందులో కొందరు కస్టపడి సక్సెస్ అయితే మరి కొందరు మాత్రం సక్సెస్ కాలేకపోతారు.ఇక హీరో ల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళ వారసుల మీద అయితే తీవ్రమైం విమర్శలే వస్తాయి.

 Heroes Who Replied To Those Who Commented That They Will Not Work As Actors, Ram-TeluguStop.com

వాళ్ళుచూడడానికి బాగాలేకపోయినా,యాక్టింగ్ సరిగా చేయకపోయినా వాళ్ళ మీద చాలా విమర్శలు వస్తూనే ఉంటాయి.ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు అలా విమర్శలు ఎదురుకుంటూ వచ్చిన వాళ్లే అయితే అలాంటి వాళ్లు ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జున మొదటగా నాగార్జున ఇండస్ట్రీ కి వచ్చినపుడు నాగేశ్వర రావు( Nageswara Rao ) కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చాడు తప్ప అయన చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు దాంతో అందరు నాగార్జున సినిమాలకి పనికి రాడు అంటూ కొన్ని విమర్శలు చేసారు చూడడానికి కూడా చాలా బక్కగా ఉన్నాడు ఈయనేం హీరో అంటూ చాలా విమర్శలు ఎదురుకున్నాడు కానీ చాలా తొందర్లోనే అందరికి తన సినిమాలతో సమాధానం చెప్పాడు.శివ, గీతాంజలి( Shiva, Geetanjali ) లాంటి సినిమాల్లో సూపర్ గా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు అలాగే యువసామ్రాట్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు.

 Heroes Who Replied To Those Who Commented That They Will Not Work As Actors, Ram-TeluguStop.com
Telugu Allu Arjun, Dhruva, Gangotri, Nagarjuna, Pushpa, Ram Charan, Sukumar-Movi

అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో హీరో గా పరిచయమైనా అల్లు అర్జున్( Allu Arjun ) ఆ సినిమాలో చూడడానికి అసలు బాగుండడు.దాంతో ఆ సినిమా చూసిన చాలా మంది అల్లు అర్జున్, అల్లు అరవింద్ కొడుకు కాబట్టి సినిమాల్లో హీరో అయ్యాడు.అంతే గంగోత్రి( Gangotri ) సినిమాలో కాన్సెప్ట్ బాగుంది కాబట్టి సినిమా హిట్ అయింది తప్ప ఆయన అసలు హీరో మెటీరియల్ కాదు అని అందరు చాలా విమర్శలు చేసారు దాంతో ఇలా అయితే వర్క్ అవుట్ కాదు అని అల్లు అర్జున్ ఆర్య సినిమాలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు గంగోత్రి సినిమాలో ఆర్య సినిమాలో హీరో ఒక్కరేనా అని అందరు ఆశ్చర్య పడేలా చేసాడు ఇక ఆ తరువాత స్టైలిష్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు…ప్రస్తుతం పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా కూడా గుర్తింపు పొందాడు.

Telugu Allu Arjun, Dhruva, Gangotri, Nagarjuna, Pushpa, Ram Charan, Sukumar-Movi

రామ్ చరణ్ చిరంజీవి కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్( Ram Charan ) చిరుత సినిమాతోనే స్టార్ హీరో గా మారాడు అయితే కెరియర్ మొదట్లో మొత్తం కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒకే టైపు అఫ్ స్టోరీ లని చేస్తూ వచ్చాడు.దాంతో రామ్ చరణ్ కి యాక్టింగ్ సరిగా రాదు, ఈయన చిరంజీవి కొడుకు కాబట్టి ఇండస్ట్రీ లో ఉన్నాడు లేకపోతే ఎప్పుడో ఫేడ్ అవుట్ అయ్యేవాడు అంటూ చాలా విమర్శలు ఎదురుకున్నాడు ఆ విమర్శలకి సమాధానం చెప్పాలి అని అనుకోని కమర్షియల్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి డిఫరెంట్ గా దృవ సినిమా( Dhruva movie ) చేసాడు ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఆ తరువాత సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం చేసాడు…ఇది ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాకుండా రామ్ చరణ్ కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన సినిమా గా కూడా చెప్పుకోవచ్చు…ఇప్పుడు ఏకం గా ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు…చాలా అవార్డులు అందుకున్నాడు.ఇలా ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొదట్లో విమర్శలు రావడం సహజం, ఆ విమర్శలని ఎదురుకుంటూ ముందుకు వెళ్తేనే సక్సెస్ సాధించగలం అని వీళ్ళ అందరిని గమనిస్తే మనకు అర్థం అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube