అయ్యా విశాల్..నీకసలు ఏం కావాలో ముందు డిసైడ్ అవ్వు !

విశాల్.బేసిక్ గా తెలుగు వాడే .కానీ ఆరవ వాళ్ళను బాగా ఓన్ చేసుకున్నాడు.

అతడికి ఏం కావాలో ఆయనకే తెలిసినట్టు లేదు.

లాఠీ అనే సినిమా చేసేసి హడావిడిగా తెలుగు ప్రేక్షకుల మీదకు వదిలేసాడు.సినిమా చూడటానికి వెళ్లిన వారిని లాఠీ తో చచ్చేలా కొట్టేసాడు.అంత తీసుగొట్టు సినిమా.

ఒక వైపు తమిళ, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలను యావత్ భరత్ దేశం నెత్తిన పెట్టుకుంటుంటే ఓ పట్టాన మారని మనిషి ఈ విశాల్.ఒకసారి నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది అంటాడు.

మరోవైపు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కానీ జగన్ కి ఓటు వేస్తాను అంటాడు.ఈ కుప్పం తెలివితేటలు అన్ని కూడా రాజకీయాల్లో కాకుండా సినిమా ఇండస్ట్రీ లో మంచి సినిమాలను తీసి పని లో పెడితే సక్సెస్ అవ్వచ్చు.

Advertisement
Hero Vishal Unplanned Career And Life , Hero Vishal , Laati Movie, Tamil, Malaya

కానీ గత కొన్ని సినిమాలు వరసగా ఎగిరి తంతున్న మనోడి లో ఎలాంటి మార్పు లేదు.ఇంకా ఇంకా ప్రజలపై అక్కరకు రాని, సోల్డ్ అవుట్ కంటెంట్ తో దాడి చేస్తూనే ఉన్నాడు.

అయితే లాఠీ సినిమా ట్రైలర్ చూసినప్పుడే జనాలకు సినిమా ఏంటో అర్ధం అయిపోయింది.అనుకున్నట్టుగానే ఈ లాఠీ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఇక విశాల్ మారాడు అని అంత ఫిక్స్ అయ్యారు.అదే ఇమేజ్ చట్రంలో ఇరుక్కొని, అనవసరమైన చెత్త కథ, కథనాలతో ప్రేక్షకుడిని విసిగించేస్తున్నాడు.

Hero Vishal Unplanned Career And Life , Hero Vishal , Laati Movie, Tamil, Malaya

కెరీర్ మొత్తం మీద ఒక్కటంటే ఒక్క సినిమా అయినా ఇది నేను చేశాను అని గొప్పగా చేశాను అని చెప్పుకోగలిగే సీన్ లేదు.సినిమా ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని ఏళ్ళు అయ్యిన కూడా ఇంకా విషాక్ అసోసియేషన్ గొడవలు తప్ప సాధించింది ఏమి లేదు.ఇక సినిమా జీవితం ఎలా ఉన్న వ్యక్తి గత జీవితం ఏమైనా బాగుందా అంటే అది కూడా లేదు.

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం అయ్యాక ఆమె నీతో పెళ్లి వద్దు పో అని బ్రేకప్ చెప్పేసింది.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాగె కొన్నాళ్ళు సాగితే రిటైర్మెంట్ అవ్వడం మాత్రం ఖాయం.

Advertisement

తాజా వార్తలు