తెలుగు సినీ ప్రేక్షకులకు తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులకు చేరువ అయిన విషయం తెలిసిందే.
మరి ముఖ్యంగా పందెం కోడి సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు హీరో విశాల్.హీరో విషయాలు ఒక వైపు నటుడిగా బిజీబిజీగా ఉంటూనే మరొకవైపు నిర్మాతగా కూడా బిజీగా గడుపుతున్నాడు.
హీరోగా వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరొకవైపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు హీరో విశాల్.ఇది ఇలా ఉంటే తాజాగా హీరో విశాల్ కి సంబంధించి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే స్టార్ హీరో అయినా విశాల్ సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సంఘాలలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే విశాల్ ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే ఇంతకుముందు హీరో విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపించాయి.
ఆ తరువాత హైదరాబాద్ కు చెందిన యువతతో వివాహం నిశ్చితార్థం జరిగి తర్వాత పెళ్లి కూడా ఆగిపోయింది.దీంతో విశాల్ ప్రస్తుతం నటన పైనే పూర్తి దృష్టి సారించారు.

ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో హీరో విశాల్ నటి అభినయతో ప్రేమలో పడ్డారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.కాగా ఈ వార్తలపై హీరో విశాల్ స్పందించలేదు.ఈ వార్తలపై స్పందించిన నటి అభినయ వాటిని ఖండించింది.ఇది నాడీగల్ అనే చిత్రంతో నటిగా పరిచయమైన నటి అభినయ మూగ చెవిటి యువతి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఆ సమస్యలన్నీ జయించి నటిగా రాణిస్తోంది నటి అభినయ.విశాల్ తనపై వస్తున్న ప్రేమ అన్న ప్రచారాల గురించి స్పందించిన అభినయ ప్రస్తుతం తాను ఆంటోనీ సినిమాలో విశాల్ కు భార్యగా నటిస్తున్నానని తెలిపారు.
రీల్ లైఫ్ లో భార్యగా నటిస్తే రియల్ లైఫ్ లో కూడా భార్య కాగలమా అంటూ నటి అభినయ ప్రశ్నించింది.దీంతో వీరిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ వచ్చేసింది.