సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో నటుడు విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేవారు అనంతరం పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి విజయ్ దేవరకొండకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోయారు.
ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఈయన ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా నటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి విజయ్ దేవరకొండకు కేవలం అబ్బాయిలు మాత్రమే కాకుండా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అధికంగా ఉందని తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ను అనుసరించే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది అయితే తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులు ఆయనతో మాట్లాడటం కోసం చేసినటువంటి ఓ పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఈ క్రమంలోనే హర్షితా రెడ్డి( Harshita Reddy ) అనే ఓ అభిమాని తన స్నేహితురాలితో కలిసి ఉన్నటువంటి ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ వీడియోని షేర్ చేసినటువంటి ఆమె ఈ వీడియోకి విజయ్ దేవరకొండ స్పందించి కామెంట్ చేస్తేనే తాము పరీక్షలకు చదువుతాము అంటూ పోస్ట్ చేశారు ఈ వీడియో పై విజయ్ దేవరకొండ రియాక్ట్ అవ్వడం ఏంటి అంటూ హేళన చేశారు.ఇలా ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి విజయ్ దేవరకొండ కంటపడటంతో ఆయన ఈ వీడియో పై స్పందిస్తూ మీరు కనుక 90% పరీక్షలలో మార్కులు తెచ్చుకుంటే స్వయంగా మిమ్మల్ని కలుస్తాను అంటూ కామెంట్ చేశారు.

ఇలా విజయ్ దేవరకొండ ఏకంగా వారిని కలుస్తాను అంటూ కామెంట్ చేయడంతో పలువురు ఈ వీడియో పై స్పందిస్తూ ఒకవేళ వాళ్ళు కనుక ఫెయిల్ అయితే మేము వచ్చి కలుస్తాము అంటూ ఫన్నీగా కామెంట్స్ చేయగా మరికొందరు వాళ్లు కనుక పరీక్షలలో ఫెయిల్ అయితే వాళ్లకు 24 గంటల పాటు లైగర్ సినిమా చూపించాలి అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ఈ వీడియో పై రియాక్ట్ అవుతూ కామెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు దీంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే ఇటీవల ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన త్వరలోనే ఫ్యామిలీ స్టార్ ( Family Star ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.







