‘తులసి’ చిత్రంతో వెంకటేష్‌కు వినాయక్ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఇచ్చిన విషయం తెల్సిందే.ఇంకా ఎంతో మంది స్టార్స్‌కు వినాయక్ భారీ విజయాలను తెచ్చి పెట్టాడు.
కాని ఇప్పుడు వినాయక్‌ను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.వినాయక్‌తో చిన్న హీరోలు కూడా సినిమాలు చేసేందుకు జంకుతున్నారు.
ఏమాత్రం ఈయనపై అంచనాలు లేకపోవడంతో పాటు, వినాయక్ గత చిత్రం మరీ దారుణమైన పరాజయం పాలయ్యింది.ఆ కారణంగానే వినాయక్‌తో మూవీకి ఎవరు ముందుకు రావడం లేదు.

నిన్న మొన్నటి వరకు బాలకృష్ణ ఒక సినిమాను వినాయక్‌తో చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత బోయపాటితో బాలయ్య మూవీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక బాలయ్య మూవీ పనిలో ఉన్న కారణంగా వినాయక్ మరో హీరోను వెదుకున్నాడు.ఇటీవలే వెంకటేష్ ఈయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
కథ ఇంకా ఏది కూడా ఫిక్స్ కాకుండానే వినాయక్ దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకే చెప్పాడు.

వెంకటేష్ తనకు గతంలో వినాయక్ సక్సెస్ ఇచ్చాడనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఆఫర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.ఆఫర్‌తో వినాయక్ తనను తాను నిరూపించుకుంటాడేమో చూడాలి.భారీ ఎత్తున వెంకీ, వినాయక్‌ల మూవీని నిర్మించేందుకు సి కళ్యాణ్ కూడా సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట.వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.వెంకీ తాజాగా ‘ఎఫ్2’ చిత్రంతో పాటు, మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ రెండు సినిమాల తర్వాత వినాయక్ మూవీ చేయనున్నాడు.