విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ సుదీర్ఘ కాలంగా సక్సెస్ ఫుల్ గా సాగింది.అయితే ఈ మధ్య కాలంలో ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోవడం లేదు.
ఒక వేళ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఇతర హీరోల సినిమాల వసూళ్లతో పోల్చితే నిరాశ మిగులుతోంది.మొత్తానికి వెంకటేష్(Venkatesh) సినీ కెరీర్ అత్యంత దారుణంగా ఉందంటూ స్వయంగా ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఆయన తన వయసుకు తగ్గ పాత్రలు, సినిమా లు చేస్తే బాగుంటుంది అంటూ అభిమానులు అనుకుంటున్నారు.ఈ మధ్య కాలంలో వెంకటేష్ సినిమా ల ఎంపిక విషయం లో కాస్త సడలింపు లు ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
అంటే ఒక వైపు హీరో గా నటిస్తూనే మరో వైపు యంగ్ హీరో ల సినిమా ల్లో కీ రోల్స్ లో కనిపించబోతున్నాడు.అంటే వెంకటేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు అని అర్థం అవుతోంది.అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా వెంకీ చేయబోతున్న సినిమాలు ఏంటి.ఎలా ఉండబోతున్నాయి అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలో ఆయనకు ఎంతో ఇష్టం అయిన ఒక యంగ్ హీరో సినిమా లో( Young Hero Movie ) కీలక పాత్ర లో నటించేందుకు ఓకే చెప్పాడట.
ఆ సినిమా లో వెంకీ పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండదట.అయినా కూడా ఆ హీరో కోసం సినిమా లో నటించేందుకు ఓకే చెప్పాడు అంటున్నారు.అంతే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా( Character Artist ) రోల్స్ చేస్తే ఎలా ఉంటుంది, ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా చూసుకోవడానికి వెంకీ మామకు ఇది సరైన అవకాశం అన్నట్లుగా భావిస్తున్నారట.
ఇంతకు ఆ హీరో ఎవరు, ఆ సినిమా లో వెంకీ ఎలాంటి పాత్ర లో నటిస్తాడు అనే విషయాలు తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.