దానికి భయపడవద్దంటున్న హీరో వెంకటేష్.. వైరల్ స్టోరీ?

Hero Venkatesh Does Not Want To Be Afraid Of It Viral Story ,Hero Venkatesh, Tollywood,Victory Venkatesh,drsyam 2,F3 ,Venkatesh Story Viral

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం వల్ల.ప్రతి ఒక్కరూ తమ మనసులో ఉన్న మాటలు సోషల్ మీడియా ద్వారా బయటపెడుతున్నారు.

 Hero Venkatesh Does Not Want To Be Afraid Of It Viral Story ,hero Venkatesh, Tol-TeluguStop.com

  ఇతరులను ఉద్దేశించి ఏమైనా మాట అనాలన్న కూడా సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు.కొన్ని కొన్ని సార్లు తమకు ఎదురైన సంఘటనలను కూడా చిన్న కొటేషన్స్ ద్వారా చెబుతూ ఉంటారు.

సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా మనసులో ఉన్న మాటలను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ ఉంటారు.

అప్పుడప్పుడు ఇతరులకు సలహాలు ఇవ్వటానికి, ధైర్యం ఇవ్వటానికి కూడా ఈ వేదిక బాగా ఉపయోగపడుతుంది.

అయితే తాజాగా హీరో వెంకటేష్ కూడా సోషల్ మీడియాలో ఒక చిన్న విషయాన్ని పంచుకున్నాడు.  ప్రస్తుతం ఆ చిన్న మాట బాగా వైరల్ అవుతుంది.ఇంతకు ఆయన ఏమన్నాడు.ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ఒకసారి తెలుసుకుందాం.

టాలీవుడ్ సినీ స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరని చెప్పాలి.సినీ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా వరుసగా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

Telugu Drsyam, Venkatesh, Tollywood, Venkatesh Story-Movie

ఈయన హీరోగా కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకొని దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించాడు.ఇక బాలీవుడ్ లో కూడా ఆయన ఒక సినిమాల్లో నటించాడు.

ఇప్పుడు కూడా యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు.

ఇక ఆ మధ్యనే దృశ్యం2, F3 అనే సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఈయన  మరే సినిమాలో నటిస్తున్నాడన్న విషయం ఎప్పటికీ కలిసి రాలేదు.దీంతో ఈయన కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అని గతంలో వార్తలు కూడా వినిపించాయి.

ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియలేదు.

Telugu Drsyam, Venkatesh, Tollywood, Venkatesh Story-Movie

ఇక వెంకటేష్ కు పెళ్లయి పిల్లలు కూడా ఉండగా వారికి కూడా పెళ్లిళ్లు చేశాడు.ఇక వెంకటేష్ అందరి హీరోలాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు.ఇప్పటికీ ఆయన లుక్కులో ఎటువంటి మార్పు లేదు.

అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు.అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటాడు.

ఇక ఈయనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా వెంకటేష్ షేర్ చేసిన స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది.

అదేంటంటే.మార్పుకు భయపడవద్దు అంటూ.

కొన్నిసార్లు మంచిది అనేది కోల్పోయిన కూడా దానికంటే బెటర్ అనేది వస్తుంది అని అన్నాడు.అయితే ఈయన ఈ పోస్ట్ షేర్ చేయగా.

ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టాడు అనేది ఆసక్తిగా మారింది.ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube