Apple వినియోగదారులకు శుభవార్త… త్వరలో AR హెడ్ సెట్!

Apple బ్రాండ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.ఈ బ్రాండ్ అంటే నేటి యువత పడి చస్తారు.

 Apple వినియోగదారులకు శుభవార్త…-TeluguStop.com

ఇక కాస్త డబ్బులు ఎక్కువ వున్న వారైతే కేవలం షోకేస్ కోసమే ఈ బ్రాండ్ వస్తువులు కొంటూ వుంటారు.ఆ విధంగా ఇది మనుషులపై ప్రభావం చూపింది అంటే ఆ బ్రాండుకున్న నాణ్యతే కారణం అని చెప్పుకోవాలి.

ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా యువత మనస్సును కొల్లగొట్టేందుకు ఆపిల్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త వస్తువులను మార్కెట్లోకి దించుతూ ఉంటుంది.

Telugu Apple, Apple Headset, Ar Set, Reality, Ups-Latest News - Telugu

యాపిల్ తన వినియోగదారులకు కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ఇతర ఉత్పత్తులను రిలీజ్ చేస్తుంది.అందులో ముఖ్యంగా ఇయర్ పాడ్స్ వంటి వాటిని చూడొచ్చు.అయితే ఈ వెర్షన్ లో కంపెనీ ఇంకొంచెం ముందడుగు వేసినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి.

భవిష్యత్ ఆపిల్ కంపెనీ కొత్త AR హెడ్ సెట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.ఆపిల్ కంపెనీ భవిష్యత్ లో ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ), ఎంఆర్(మిక్స్ డ్ రియాలిటీ) ద్వారా యూజర్లు మంచి హెడ్ సెట్ అనుభూతిని పొందెలా పరిశోధనలు చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Telugu Apple, Apple Headset, Ar Set, Reality, Ups-Latest News - Telugu

సదరు హెడ్ సెట్ వ్యాయామం, ధ్యానం వంటి వాటిపైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.ఈ సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించే అవకాశం మెండుగా ఉందని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా వినియోగదారులు తమ MR సెట్ నుంచే తమకు కావాల్సిన AR అప్లికేషన్ ను సృష్టించేలా యాప్ ను రూపొందించారని వినికిడి.ఇది కంప్యూటర్ కోడ్ తెలియని వారికి చాలా బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది.

అలాగే మరో నివేదికలో అయితే ఈ నెలలోనే ఆపిల్ MR సెట్ ను రిలీజ్ చేస్తుందని స్పష్టం చేసింది.అయితే ఈ వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని గుర్తుంచుకోవాలి.

ఎందుకంటే కంపెనీ ఈ ఎంఆర్ సెట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం కొసమెరుపు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube