‘కంచర్ల’ షూటింగ్‌ ప్రారంభం!!

ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌.క్రియేషన్స్‌ బేనర్‌పై కె.అచ్యుతరావు సమర్పణలో ఉపేంద్ర హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కంచర్ల‌. ఈ చిత్రానికి రెడ్డెం యాద కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.మీనాక్షి జైస్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో గ్రాండ్‌గా జరిగింది.

 Hero Upendra Kancharla Movie Shooting Started Details, Hero Upendra ,kancharla M-TeluguStop.com

ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు.ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర, హీరోయిన్లు మీనాక్షి జైస్వాల్‌, ప్రణీతలపై తొలి షాట్‌ని దర్శకుడు రెడ్డెం యాద కుమార్‌ చిత్రీకరించగా సమర్పకులు కె.అచ్యుతరావు క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు.

అనంతరం చిత్ర‌ సమర్పకులు కె.అచ్యుతరావు మీడియాతో మాట్లాడుతూ…‘‘సినీ ప్రేక్షకులకు వినూత్న కథాంశంతో కూడిన చిత్రాన్ని అందించేందుకు ‘కంచర్ల’ చిత్రం రూపొందిస్తున్నామన్నారు.ఈ చిత్రం అన్ని వర్గాల, అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నాం.

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న ‘కంచర్ల’ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

దర్శకులు రెడ్డెం యాద కుమార్‌ మాట్లాడుతూ .‘‘యువకులు రాజకీయాల్లోకి రావాలి.సేవా దృక్పథంతో ఉండాలి అనే కాన్సెప్ట్‌ తో లవ్‌ అండ్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.

తొలి షెడ్యూల్‌ ప్రారంభించాం.విశాఖ ప్రాంతంలోనే మొద‌టి షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ జ‌రుపుతాము.

ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం.` అన్నారు.

హీరో ఉపేంద్ర, హీరోయిన్‌ మీనాక్షి జైస్వాల్‌ మాట్లాడుతూ…‘‘కంచర్ల చిత్రం తమ నటనా జీవితానికి మలుపు రాయిగా నిలుస్తుంది’ అన్నారు.కార్యక్రమంలో సినీ నటుడు బాహుబలి ప్రభాకర్‌, డీఓపీ గుణశేఖర్‌, క్యాలు జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube