జైల్లో ఉన్నన్ని రోజులు నేను చేసిన పని అదే - హీరో సుమన్

ఎవరైనా తప్పు చేసి జైలుకెళ్తారు.

జైలులో తాను చేసిన తప్పుకు పశ్చాతాపం చెంది, తిరిగి జైలు నుంచి బయటకు వచ్చేసరికి మళ్లీ ఎలాంటి తప్పు చేయకూడదు అని అనుకునేలా ఉంటుంది జైలు జీవితం.

కానీ ఏ తప్పు చేయని వాడు జైల్లో ఉంటె, అదొక నరకం.ఎందుకు నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నదో తెలియక, ఎప్పుడు తిరిగి బయట ప్రపంచాన్ని చూస్తాడో అర్ధం కాక, తనలో తానే కుమిలిపోయి, నిశ్చబ్దం తో మాట్లాడుకుంటూ మూడేళ్ళ పాటు ఉక్కు సంకల్పంతో పోరాడిన వ్యక్తి హీరో సుమన్.

సుమన్ జైలు జీవితం గురించి ఎవరికి నచ్చింది వారు రాసేస్తూ ఉంటారు.కానీ ఆ రాతల్లో ఎంతో రోత విషయాలు మాత్రమే కనిపిస్తాయి.

సుమన్ జైలుకు వెళ్ళడానికి కారణం ఎవరైనా అతడు అనుభవించిన బాధ అసామాన్యం.ఎంతో నిశ్శబ్దం గా ఉండే నాలుగు గోడల మధ్య అతడు ఉన్నాడో, లేడో కూడా తెలియనంత నిశ్శబ్దం.

Advertisement

వాస్తవానికి నిశ్శబ్దానికి మించిన భయంకరమైనది మరొకటి లేదు.జైలు బ్యారక్ లో గంట గంటకు వెళ్లి అసలు ఆ సెల్ లో సుమన్ ఉన్నాడా లేడో చెక్ చేసేవారు.

ప్రతి సారి ఒక మూలాన కూర్చొని ఎలాంటి ఉలుకు పలుకు లేని సుమన్ ని చూసి అక్కడ మనిషి బ్రతికే ఉన్నాడు నిర్దారించుకునవాళ్లు.తానెందుకు ఆ జాల్లో ఉన్నాడో తెలియక, తాను చేసిన తప్పేంటో తనలో తానే వెత్తుకుంటూ రగిలిపోతూ ఉండేవాడు.

జైల్లో మొదటి రెండు రోజులు పాటు అదే నిశ్శబ్దం రాజ్యమేలింది.ఆ తర్వాత తనను తాను ఓదార్చుకున్నాడు.ఇక ప్రళయం లా మారిన సుమన్ ని చూసి జైలు సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు.

అక్కడ తోటి ఖైదీలు, సిబ్బంది అతడికి అభిమానులుగా మారిపోయారు.మరి ఆ రెండు రోజుల్లో ఏం జరిగిందో ఏమో కానీ మూడవ రోజులు అంత తలకిందులయ్యింది.

స‌మ్మ‌ర్‌లో బీర‌కాయ తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

తనకు తానే దైత్యమ్ చెప్పుకుంటూ, తనలో తానే మాట్లాడుకునేవాడు.తలకిందులయిన జీవితాన్ని చూసి క్రుగింపోలేదు.

Advertisement

నీకు ఎవరు తోడు లేరు అని భయపడుకు.నీకు నువ్వే తోడు.

ఉక్కు సంకల్పనతో యుద్ధం చెయ్యి.సినిమాలు నిన్నే వెతుకుంటూ వస్తాయి.

కోట్లల్లో అభిమానుల్ని సంపాదించుకుంటావ్.నీ పైన జరిగిన కుట్ర పేక మేడలా కూలిపోతుంది.

ఎవరో పన్నిన వలకు నువ్వు సమిదవు కావద్దు.అంటూ తనను తానే ఓదార్చుకున్నాడు.

ఇక ఆ జైలు గదినే బాక్సింగ్ రింగ్ గా మార్చుకున్నాడు.మెడిటేషన్, ఎక్సరసైజ్ వంటి వాటితో తిరిగి మాములు మనిషి అయ్యాడు.

ఆ పరిస్థితుల్లో వేరే ఎవరు ఉన్న డిప్రెషన్ కి లోనయ్యేవారు.కానీ సుమన్ సింహం లా గర్జించి విడుదల అవ్వగానే సినిమాల్లో బిజీ అయ్యాడు.

తాజా వార్తలు