టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ( Srikanth ) మొదట్లో వన్ బై టు అనే సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.అయితే ఈ సినిమా కంటే ముందే చాలా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ అలాగే విలన్ పాత్రల్లో నటించారు.

ఇక శ్రీకాంత్ కి హీరోగా హిట్ ఇచ్చిన సినిమా తాజ్ మహల్ ( Taj Mahal ) అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాతో శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ఏర్పడింది.దాంతో వరుసగా స్టార్ డైరెక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశం వచ్చింది.అలా శ్రీకాంత్ టాలీవుడ్ లో హీరోగా ఎదిగారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న సమయంలో హీరో హీరోయిన్లకి కామన్ గా ఎఫైర్ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఇక శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ( Ooha ) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ పెళ్లి కంటే ముందే శ్రీకాంత్ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు అని అప్పట్లో టాలీవుడ్ మీడియా కోడై కూసింది.ఇక ఆ హీరోయిన్ ఎవరు.
శ్రీకాంత్ ఆమెని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహల్ సినిమాలో మౌనిక బేడి( Mounika Bedi ) ఫస్ట్ హీరోయిన్ గా చేస్తే సెకండ్ హీరోయిన్ గా సంఘవి (Sanghavi) చేసింది.

ఈ సినిమా తర్వాత సంఘవి( Sanghavi ) శ్రీకాంత్ తో కలిసి పిల్ల నచ్చింది, మాణిక్యం, ప్రేయసి రావే వంటి సినిమాల్లో కొన్ని కీలక పాత్రల్లో చేసింది.అయితే తాజ్ మహల్ తర్వాత వరుసగా శ్రీకాంత్ తో మాణిక్యం, ప్రేయసి రావే( Preyasi Raave ) ,పిల్ల నచ్చింది వంటి సినిమాల్లో కనిపించేసరికి శ్రీకాంత్ సంఘవి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఒక పుకారు వైరల్ అయింది.
కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీకాంత్ ఊహ (Srikanth-Ooha) కి సంబంధించిన ప్రేమ విషయం అఫీషియల్ గా బయటపడడంతో సంఘవి శ్రీకాంత్ ఎఫైర్ వార్తలు ఆగిపోయాయి.అయితే వీరి మధ్య కేవలం సినిమాల మట్టుకు మాత్రమే ఫ్రెండ్షిప్ ఉంది.
కానీ కొంతమంది కావాలనే శ్రీకాంత్ పై ఎఫైర్ వార్తలు సృష్టించారట .ఇక శ్రీకాంత్ ఊహని పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తలు అక్కడితో ఆగిపోయాయి.







