పిండం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!

వచ్చే వారం సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.శ్రీరామ్,( Hero Sri Ram ) ఖుషీ రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పిండం మూవీ( Pindam Movie ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ మాత్రం మెప్పించిందో చూద్దాం.

 Hero Sri Ram Avasarala Srinivas Khushi Ravi Pindam Movie Review And Rating Detai-TeluguStop.com

కథ :

అన్నమ్మ (ఈశ్వరీరావు)( Eeswari Rao ) తండ్రి ద్వారా నేర్చుకున్న తాంత్రిక జ్ఞానంతో ఆత్మలు ఆవహించిన వాళ్లకు తన వంతు సహాయం చేస్తూ ఉంటారు.ఈ విషయం తెలిసిన లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్)( Avasarala Srinivas ) అన్నమ్మ దగ్గరకు తాంత్రిక శక్తుల గురించి పరిశోధన చేయడానికి వస్తాడు.ఆ సమయంలో అన్నమ్మ 1990 సంవత్సరంలో చోటు చేసుకున్న ఘటన గురించి లోక్ నాథ్ కు చెబుతుంది.

Telugu Eeswari Rao, Sri Ram, Horror, Khushi Ravi, Pindam, Pindam Review, Pindam

రైస్ మిల్ లో అకౌంటెంట్ గా పని చేసే ఆంథోనీ (శ్రీరామ్), మేరీ( ఖుషి రవి)( Khushi Ravi ) పిల్లలతో కలిసి ఊరి చివర ఉండే ఇంటిని కొని అందులో చేరగా ఆ ఇంట్లో మేరీ తప్ప మిగతా వాళ్లంతా ఆత్మల వల్ల ఇబ్బందులు పడతారు.ఆ ఆత్మల గతం ఏంటి? ఆ ఆత్మలు మేరీని మాత్రం ఎందుకు టార్గెట్ చేయలేదు? ఆంథోని కుటుంబానికి ఆ ఆత్మల నుంచి విముక్తి లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Telugu Eeswari Rao, Sri Ram, Horror, Khushi Ravi, Pindam, Pindam Review, Pindam

భయం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కగా కథ, కథనం విషయంలో పొరపాట్లు మైనస్ అయ్యాయి.కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.సినిమాలోని చాలా సీన్లు లాజిక్ కు అందని విధంగా ఉన్నాయి.ఫ్లాష్ బ్యాక్ లో హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉండటం మూవీకి మైనస్ అయింది.

ప్లస్ పాయింట్లు :

ప్రధాన నటీనటుల నటన, మ్యూజిక్, బీజీఎం, కొన్ని భయపెట్టే సీన్లు.

Telugu Eeswari Rao, Sri Ram, Horror, Khushi Ravi, Pindam, Pindam Review, Pindam

మైనస్ పాయింట్లు :

ఎమోషన్స్ కొరవడటం, కథ కథనం నిదానంగా సాగడం.

రేటింగ్ : 2.25/5.0

బాటమ్ లైన్ :

హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube