పిండం మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
TeluguStop.com
వచ్చే వారం సలార్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి.
శ్రీరామ్,( Hero Sri Ram ) ఖుషీ రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పిండం మూవీ( Pindam Movie ) ఈరోజు థియేటర్లలో విడుదలైంది.
ఈ మధ్య కాలంలో హర్రర్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఏ మాత్రం మెప్పించిందో చూద్దాం.
H3 Class=subheader-styleకథ : /h3p
అన్నమ్మ (ఈశ్వరీరావు)( Eeswari Rao ) తండ్రి ద్వారా నేర్చుకున్న తాంత్రిక జ్ఞానంతో ఆత్మలు ఆవహించిన వాళ్లకు తన వంతు సహాయం చేస్తూ ఉంటారు.
ఈ విషయం తెలిసిన లోక్ నాథ్ (అవసరాల శ్రీనివాస్)( Avasarala Srinivas ) అన్నమ్మ దగ్గరకు తాంత్రిక శక్తుల గురించి పరిశోధన చేయడానికి వస్తాడు.
ఆ సమయంలో అన్నమ్మ 1990 సంవత్సరంలో చోటు చేసుకున్న ఘటన గురించి లోక్ నాథ్ కు చెబుతుంది.
"""/" /
రైస్ మిల్ లో అకౌంటెంట్ గా పని చేసే ఆంథోనీ (శ్రీరామ్), మేరీ( ఖుషి రవి)( Khushi Ravi ) పిల్లలతో కలిసి ఊరి చివర ఉండే ఇంటిని కొని అందులో చేరగా ఆ ఇంట్లో మేరీ తప్ప మిగతా వాళ్లంతా ఆత్మల వల్ల ఇబ్బందులు పడతారు.
ఆ ఆత్మల గతం ఏంటి? ఆ ఆత్మలు మేరీని మాత్రం ఎందుకు టార్గెట్ చేయలేదు? ఆంథోని కుటుంబానికి ఆ ఆత్మల నుంచి విముక్తి లభించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
"""/" /
భయం ప్రధానంగా ఈ మూవీ తెరకెక్కగా కథ, కథనం విషయంలో పొరపాట్లు మైనస్ అయ్యాయి.
కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి.సినిమాలోని చాలా సీన్లు లాజిక్ కు అందని విధంగా ఉన్నాయి.
ఫ్లాష్ బ్యాక్ లో హింసాత్మక సీన్లు ఎక్కువగా ఉండటం మూవీకి మైనస్ అయింది.
H3 Class=subheader-styleప్లస్ పాయింట్లు : /h3p
ప్రధాన నటీనటుల నటన, మ్యూజిక్, బీజీఎం, కొన్ని భయపెట్టే సీన్లు.
"""/" /
H3 Class=subheader-styleమైనస్ పాయింట్లు : /h3p
ఎమోషన్స్ కొరవడటం, కథ కథనం నిదానంగా సాగడం.
H3 Class=subheader-styleరేటింగ్ : 2.25/5.
0 /h3p
H3 Class=subheader-styleబాటమ్ లైన్ :/h3p హర్రర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే.
హలో అబ్బాయిలు.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి!