శర్వానంద్ ఎంగేజ్మెంట్ కూ జంటగా హాజరైన సిద్ధార్థ్, అదితి.. ఫోటోస్ వైరల్?

టాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితి రావ్‌ హైదరి ల గురించి మనందరికీ తెలిసిందే.ఈ జంట ప్రేమలో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Hero Siddharth Attends Sharwanand Engagement Aditi Rao Hydari, Siddharth, Sharwa-TeluguStop.com

టాలీవుడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం మహాసముద్రం.ఈ సినిమాలో అను ఇమ్మాన్యూయేల్, అదితి రావ్‌ హైదరి హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.ఇందులో అదితి,సిద్దార్థ్ సరసన నటించింది.ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమ వరకు దారి తీసిందని, ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ జంట మాత్రం ఆ వార్తల పై ఇప్పటివరకు స్పందించలేదు.

Telugu Sharwanand, Siddharth-Movie

అంతే కాకుండా వీరిద్దరు కలిసి జంటగా చక్కర్లు కొట్టడం, వెకేషన్స్‌కి వెళ్లడం,సినిమా ఈవెంట్స్‌కి కలిసి హజరవుతుండటంతో ఇలా ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసి వెళ్తుండడంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం చేకూర్చినట్టు అయింది.ఈ క్రమంలోనే ఈ జంట తాజాగా మరోసారి కలిసి కనిపించారు.టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరయ్యారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోసారి ఈ జంట ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇప్పటికే చాలా సందర్భాలలో కలిసి కనిపించిన ఈ జంట మరోసారి ఇలా కనిపించడంతో అభిమానులు నెటిజెన్స్ మీరు నిజంగానే ప్రేమలో ఉన్నారా లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Sharwanand, Siddharth-Movie

ఇకపోతే హీరో శర్వానంద్ విషయానికి వస్తే.తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడ ఉన్నాడు.శర్వానంద్ కు కాబోయే భార్య రక్షతా రెడ్డి యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది.

తాజాగా సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో ఈ జంటకు అభిమానులు నెటిజన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అలాగే సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ జంట చాలా చూడ ముచ్చటగా ఉంది.మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube