తనను కాపాడిన వ్యక్తికి సాయితేజ్ చేసిన సాయం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు మెగా హీరోలలో అటు మాస్ రోల్స్ తో, ఇటు క్లాస్ రోల్స్ తో విజయాలను అందుకున్న హీరోగా సాయితేజ్( Sai Tej ) కు పేరుంది.

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ హీరో వివాదాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.

మరికొన్ని గంటల్లో ఈ హీరో నటించిన విరూపాక్ష మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సినిమాపై విడుదలకు ముందే పాజిటివ్ గా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే కొన్ని నెలల క్రితం బైక్ పై వేగంగా వెళుతూ సాయితేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. విరూపాక్ష ప్రమోషన్స్ ( Virupaksha Promotions ) లో భాగంగా ఆ యాక్సిడెంట్ గురించి స్పందించిన సాయితేజ్ యాక్సిడెంట్( Saitej accident ) వల్ల 12 రోజులు బెడ్ కే పరిమితమయ్యానని తెలిపారు.12 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నానని ఆయన కామెంట్లు చేశారు.నన్ను కాపాడిన వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదని సాయితేజ్ తెలిపారు.

నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నా ఫోన్ నంబర్ కు కాల్ చేయాలని మేము నీకు ఎప్పటికీ అండగా ఉంటామని చెప్పానని సాయితేజ్ చెప్పుకొచ్చారు.డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం నాకు నచ్చదని ఆయన తెలిపారు.ఆ వ్యక్తికి మా కుటుంబం నుంచి డబ్బు సహాయం చేశారో లేదో నాకు తెలియదని సాయితేజ్ పేర్కొన్నారు.

Advertisement

నన్ను కాపాడిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియవని అయితే సాయం అవసరమైతే తోడుగా ఉంటానని చెప్పానని ఆయన వెల్లడించారు.

నేను మద్యం తాగనని నేను ఏవో తీసుకున్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని సాయితేజ్ పేర్కొన్నారు.ఆ వార్తలు నిజం కాదని నాకు, నా కుటుంబానికి తెలుసని సాయితేజ్ తెలిపారు.దేవాకట్టా గారి ఇంటికి వెళుతున్న సమయంలో ఆ యాక్సిడెంట్ జరిగిందని ఆయన అన్నారు.

బైక్ రైడింగ్( Bike riding ) ఇష్టమని సాయితేజ్ కామెంట్లు చేశారు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు