స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రానా.. వచ్చేయ్ నేనే ఎంట్రీ ఇప్పిస్తా అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో రానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో రానా పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేసింది సినిమా బాహుబలి.

 Hero Rana Daggubati Shares Video Goes Viral Social Media Details, Rana Daggubati-TeluguStop.com

ఈ సినిమాలో బల్లాల దేవుడిగా అద్భుతంగా నటించి పాన్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు రానా.బాహుబలి సినిమా తర్వాత చివరగా విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఆ సినిమా అనుకున్న విధంగా సక్సెస్ కాలేకపోయింది.

అయితే రానా ప్రస్తుతం ఏ సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయాలు ఇంకా తెలియలేదు.ఇకపోతే దగ్గుబాటి హీరోలయిన వెంకటేశ్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు.

సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది.ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే రానా వెంకటేశ్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.ఇందుకు సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశారు రానా.ఆ వీడియోలో రానా మాట్లాడుతూ.వచ్చేయ్.ట్రైలర్ లాంఛ్‌లో కలుద్దాం.అక్కడా గేటు దగ్గర వద్ద నీకు ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు తండ్రినని చెప్పు.నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు అంటూ కాస్త సీరియస్ గా డైలాగ్ చెప్పారు రానా.కాగా ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది.ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా ఇప్పటికే వెంకటేశ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు.ఆ వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకీ.చేతిలో గన్‌ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు.ఇకపోతే రానా మిహిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక ఇంటీ వాడు అయిన సంగతి తెలిసిందే.

  ఒకవైపు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా భార్యతో కలిసి వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రానా.ఎప్పటికప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూనే ఉంటాడు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube