రామ్ చరణ్ శంకర్ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో తారక్ తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తరువాత సినిమా గురించి చాలా వార్తలు వచ్చినా చివరకు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా ఫైనల్ అయింది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Hero Ram Charan Shankar Movie Music Director Finalized,tollywood,ramcharan,shan

టాప్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శంకర్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమాకు దర్శకునిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు ఇప్పటివరకు ఎ ఆర్ రెహమాన్ లేదా హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.అయితే ఈసారి మాత్రం యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కే అవకాశం ఇవ్వాలని శంకర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Hero Ram Charan Shankar Movie Music Director Finalized,tollywood,ramcharan,shan

అయితే ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.మరోవైపు ఈ సినిమా 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని దాదాపు సగం బడ్జెట్ హీరోహీరోయిన్లు, డైరెక్టర్ రెమ్యునరేషన్ గా ఉండనుందని ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన దసరా పండుగ కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.రామ్ చరణ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న విధానం టాలీవుడ్ టాప్ హీరోలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుందో చూడాల్సి ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు