దివంగత కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్( Puneeth Rajkumar ) ఏ హీరో వల్ల సాధ్యం కాని సక్సెస్ రేట్ అందుకున్నాడు.నిజానికి ఈ హీరో సక్సెస్‌లో తెలుగు రచయితలు, దర్శకులు కీలక పాత్ర పోషించారు.
ఈ నటుడు “అప్పు” సినిమాతో ( Appu Movie ) హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.దీన్ని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు మన మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.
దీన్ని తెలుగులో రవితేజ హీరోగా “ఇడియట్” పేరుతో రీమేక్ చేశారు.పునీత్ రాజ్ కుమార్ 32 సినిమాల్లో కథానాయకుడిగా కనిపించాడు.
అందులో మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆరు సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.
మిగతా సినిమాలన్నీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
6 హిట్స్, 6 సూపర్ హిట్స్, 5 బ్లాక్ బస్టర్ హిట్స్, 3 ఇండస్ట్రీ హిట్స్‌ను అందుకున్నాడు పునీత్.పునీత్ మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు.అతడి “అప్పు” మూవీ 200 రోజులు పాటు థియేటర్లలో ఆడింది.
ఆ రోజుల్లోనే ఈ సినిమా వల్ల నిర్మాతకు 11 కోట్ల లాభం వచ్చింది.అది మామూలు విషయం కాదు.
ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.ఈ సినిమా తర్వాత పునీత్ “అభి”( Abhi Movie ) అనే ఒక మూవీ చేశాడు.
ఇందులో ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడతాడు.ఈ రొమాంటిక్ కామెడీ మూవీ 16 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్ అయింది.
దీంతో పునీత్ స్టార్ హీరోగా మారిపోయాడు.
పునీత్ హీరోగా వచ్చిన మూడవ సినిమా “వీర కన్నడిగ”( Veera kannadiga ) కూడా 100 రోజులు ఆడింది.ఇది తెలుగులో పూరి జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి తీసిన ఆంధ్రావాలా సినిమాకి రీమేక్.అయితే కన్నడ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడు.
ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్, అనితా హస్సానందని ప్రధాన పాత్రలు పోషించారు.దీని తర్వాత 2005లో ఆకాష్( Akash Movie ) అనే రొమాంటిక్ డ్రామా చిత్రం తీశాడు.
ఇది కూడా పునీత్ కెరీర్ లైఫ్ లో చెప్పుకోదగిన హిట్ అయింది.దీని తర్వాత పునీత్ హీరోగా నటించిన అరసు, మిలనా, వంశీ, రామ్, జాకీ, హుడుగారు, పవర్, రాజకుమార, నటసార్వభౌమ, యువరత్న, జేమ్స్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్స్ అయ్యాయి.
పునీత్ దురదృష్టం కొద్దీ 46 ఏళ్ల వయసులో చనిపోయాడు.లేదంటే మరిన్ని హిట్స్ సాధించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా ఎప్పటికీ నిలిచిపోయి ఉండేవాడు.