పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈయన బాహుబలి సినిమాలో యాక్షన్ సన్నివేశాలలో నటించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆ సమయంలో ఈయనకు విపరీతమైనటువంటి మోకాలు నొప్పి వచ్చిందని అప్పటినుంచి ఈయన మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారనే సంగతి మనకు తెలిసిందే.
ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం ప్రభాస్ యూరప్ వెళ్లి సర్జరీ ( Surgery ) చేయించుకున్న సంగతి తెలిసిందే.యూరప్ లో దాదాపు నెల రోజుల పాటు ఉన్న ఈయన సలార్ ( Salaar ) సినిమా విడుదల సమయంలో ఇండియా వచ్చారు.అయితే తాజాగా ప్రభాస్ కి సంభందించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రభాస్ కి సర్జరీ చేసినప్పటికీ మోకాలు తిరిగి నొప్పి మొదలైందని అందుకే ఈయన మరోసారి తిరిగి సర్జరీకి సిద్ధమయ్యారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా ప్రభాస్ మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.అయితే ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన లేకపోయినా అభిమానులు మాత్రం ఈయన ఆరోగ్యంగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు.ఇక ప్రభాస్ కి మరోసారి సర్జరీ చేస్తున్నారనే వార్తలు రావడంతో ఈయన నటించిన కల్కి( Kalki ) సినిమా కూడా వాయిదా పడుతుందా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కల్కి సినిమాని మే 9వ తేదీ విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే.