హీరో నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్ర యూనిట్‌కు అరుదైన గౌరవం.. ఇస్కాన్ మెయిన్ సంస్థానం ‘బృందావన్‌’కు ప్రత్యేక ఆహ్వానం..

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న కార్తికేయ 2 సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది.

 Hero Nikhil Karthikeya 2 Movie Unit Gets Special Invitation To Visit Iskcon Deta-TeluguStop.com

కార్తికేయ 2 చిత్రం శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు.తాజాగా కార్తికేయ 2 చిత్రయూనిట్‌కు ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలంటూ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ గారి నుంచి ఆహ్వానం లభించింది.

ఇస్కాన్ దేవాలయాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు.దేశదేశాల్లో.ఖండఖండాంతరాలుగా వ్యాపించి ఉన్నాయి.ఆస్ట్రియా లాంటి దేశాల నుంచి మొదలుపెట్టి ఎన్నో వందల దేశాల్లో ఇస్కాన్ టెంపుల్స్ కొలువై ఉన్నాయి.

అంతటి ప్రగ్యాతి గాంచిన ట్రస్ట్ నుంచి కార్తికేయ 2 టీమ్‌కు ఆహ్వానం లభించడం నిజంగా గర్వించదగ్గ విషయం.ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి.

భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి.అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించింది.

బృందావన్‌కు ఆహ్వానం అనేది చిన్న విషయం కాదు.శ్రీ కృష్ణుడి తత్వం, ఫిలాసఫీ, ఆయన ఆరా భరతఖండంపై ఎలా ఉంది.

ాయన బోధించిన సారాంశం ఏంటి అనేది కోర్ పాయింట్‌గా కార్తికేయ 2 సినిమా ఉండబోతుంది.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube